»Telangana Army Boys Sports Company Recruitment Rally From July 3rd To 15th More Details
Telanganaలో ఆర్మీ భారీ రిక్రూట్ మెంట్ ర్యాలీ.. ఎప్పుడంటే..?
భారత సైన్యంలో చేరాలనుకునే విద్యార్థులకు శుభవార్త. తెలంగాణలో భారీ ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరుగనుంది. ఏకంగా 12 రోజుల పాటు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
భారత సైన్యంలో (Indian Army) చేరాలనుకునే విద్యార్థులకు శుభవార్త. తెలంగాణలో (Telangana) భారీ ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ (Army Recruitment Rally) జరుగనుంది. ఏకంగా 12 రోజుల పాటు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దీనికి సంబంధించి కంటోన్మెంట్ (Contonment) అధికారులు ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ రిక్రూట్ మెంట్ ర్యాలీ క్రీడా కోటాకు సంబంధించినది కావడం విశేషం. క్రీడాకారుల (Sportsmen) కోసం ప్రత్యేకంగా ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ చేపట్టనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆర్మీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ (బీఎస్సీ)లో (Army Boys Sports Company) క్రీడాకారుల ఎంపిక జూలై 3 నుంచి 15వ తేదీ వరకు చేపట్టనున్నారు. హైదరాబాద్ తిరుమలగిరిలోని (Tirumalagiri) 1ఈఎంఈ సెంటర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగనుంది. వాలీబాల్ (Wollyball), కాయకింగ్ (Kayaking), కనోయింగ్ (Canoeing) విభాగాల్లో 8 నుంచి 14 ఏళ్ల మధ్య వయసులోపు క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. మిగతా వివరాల కోసం 93985 43351 నంబర్ వాట్సప్ లో కానీ, తిరుమలగిరిలోని 1ఈఎంఈ సెంటర్ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ ట్రైనింగ్ బెటాలియన్ లో అధికారులను కలవవచ్చు.
అర్హతలు, ఇతర వివరాలు
– 2009 జూలై 3 నుంచి 2015 జూలై 15 మధ్య జన్మించిన వారు అర్హులు.
– కనీసం మూడో తరగతి చదివి ఉండాలి.
– హిందీ, ఆంగ్ల భాషలో కనీస పరిజ్ణానం ఉండాలి.
– ఆర్మీ స్పోర్ట్స్ ఇన్ స్టిట్యూట్ మెడికల్ ఆఫీసర్, ఆర్మీ స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ స్పెషలిస్ట్ ల ధ్రువీకరణ ఉండాలి.
– ఏదైనా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు గెలుపొందిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
– శరీరంపై ఎక్కడ శాశ్వత టాటూ వేయించుకోని వారు ఉండాలి.
ఎంపికైతే..
– ఈ రిక్రూట్ మెంట్ ర్యాలీలో ఎంపికైన వారికి అనేక సౌకర్యాలు, వసతులు ఉంటాయి.
– ఎంపికైన అభ్యర్థులను స్పోర్ట్స్ క్యాడెట్లుగా పరిగణిస్తారు.
– ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు.
– పదో తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు.
– శిక్షణలో ఉచిత బీమా, వైద్య సదుపాయం ఉంటుంది.