»Uk Woman Sues Boss For Mistaking Xx Code In Email Fined 5000
Boss పంపిన కోడ్ ను తప్పుగా అర్థం చేసుకున్న మహిళా ఉద్యోగి.. భారీ జరిమానా
ఆ లేఖను చదివిన న్యాయమూర్తి విస్తుపోయారు. ఆ లేఖలో దురుద్దేశం ఏదీ లేదని చెప్పారు. ఆమె తప్పుగా అర్థం చేసుకుందని కోర్టు భావించింది. విచారణ అనంతరం కోర్టు జరిమానా విధించింది. 5 వేల పౌండ్లు చెల్లించాలని ఆదేశించింది.
తన పై అధికారి అంటే బాస్ (Boss) తనకు రాసిన లేఖను (Letter) మహిళా ఉద్యోగి (Women Employee) తప్పుగా భావించింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ కోర్టును ఆశ్రయించగా.. ఉల్టా ఆమెకే భారీ జరిమానా (Fine) పడింది. ఈ సంఘటన లండన్ లో వెలుగు చూసింది. అయితే బాస్ రాసిన లేఖను ఆమె తప్పుగా భావించింది. ఆమె పొరపాటుకు ఏకంగా రూ.5 లక్షలు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కరీనా గాస్పరోవా (Karina Gasparova) అనే ఉద్యోగిని ఈఎస్ఎస్ డాక్స్ (ESSDocs) సంస్థలో పని చేస్తోంది. ఇటీవల ఆమెకు ఆమె పైఅధికారి అలెగ్జాండర్ గౌలాండ్రిస్ ఓ మెయిల్ పంపాడు. ఆ మెయిల్ లో కొన్ని కంపెనీల పేర్లకు బదులు ఎక్స్, వై అనే అక్షరాలు రాశారు. వాటి స్థానంలో తగిన పదాలు రాయాలని మెయిల్ లో సూచించాడు. కానీ కరీనా మాత్రం దానిని తప్పుగా భావించింది. ఎక్స్ (XX) అంటే ముద్దు అని, వై (Y) అంటే చేరువగా రావాలి అని ఆమె తప్పుగా అర్థం చేసుకుంది. వెంటనే పై అధికారిని, కంపెనీపై లండన్ సెంట్రల్ కోర్టులో (London Central Court) పిటిషన్ వేసింది. ఆమె పిటిషన్ ను స్వీకరించిన కోర్టు విచారణ చేపట్టింది.
విచారణ సమయంలో కరీనా తన పైఅధికారి తీవ్ర ఆరోపణలు చేసింది. ఇక కంపెనీ కూడా తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. ఆ క్రమంలోనే తనను ఉద్యోగంలో నుంచి తొలగించిందని వాపోయింది. ఈ సందర్భంగా తన బాస్ రాసిన లేఖను కోర్టుకు సమర్పించింది. ఆ లేఖను చదివిన న్యాయమూర్తి (Lawyer) విస్తుపోయారు. ఆ లేఖలో దురుద్దేశం ఏదీ లేదని చెప్పారు. ఆమె తప్పుగా అర్థం చేసుకుందని కోర్టు భావించింది. విచారణ అనంతరం కరీనాకు కోర్టు జరిమానా విధించింది. 5 వేల పౌండ్లు (సుమారు రూ.5 లక్షలు) చెల్లించాలని ఆదేశించింది. ‘సరైన ఆధారాలు (Evidence) లేకుండా మహిళ అసాధారణ ఆరోపణలు చేసిందని గ్రహించం. పలుమార్లు పరస్పర విరుద్ధమైన ఆరోపణలు చేసింది. ఇది పొరపాటు వల్ల జరిగిందని కూడా భావించలేం. ఉద్దేశపూర్వకంగా చేయడంతో ఆమెకు జరిమానా విధించాం’ అని కోర్టు పేర్కొంది.