»Uk Mcdonalds Fined Rs 5 Crore After Customer Found Mouse Droppings In Burger
Burgerలో ఎలుక వ్యర్థాలు.. మెక్ డొనల్డ్స్ కు రూ.5 కోట్ల జరిమానా
చీజ్ బర్గర్ ఆర్డర్ ఇచ్చాడు. కొద్దిసేపటికి సిబ్బంది బర్గర్ ఇచ్చారు. ఆ వినియోగదారుడు తింటున్న సమయంలో బర్గర్ లో ఎలుక గుడ్ల వ్యర్థాలు కనిపించాయి. దీంతో అతడు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
వినియోగదారులను (Customer is God) దేవుళ్లా భావించాలనే ఒక నానుడి ఉంది. అలాంటి వినియోగదారులకు సేవలు సక్రమంగా అందించాలి. అలా కాకుండా జాగ్రత్తలు తీసుకోకుండా వంటలు వండితే వినియోగదారుల (Customers) నుంచి తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సిందే. అది ఎంత పెద్ద హోటలైనా (Hotel).. ఎంత పెద్ద సంస్థ అయినా సరే. తాజాగా జంక్ ఫుడ్ కు పేరొందిన మెక్ డొనల్డ్స్ (McDonald’s) అలాంటి తప్పిదమే చేయడంతో భారీ జరిమానా (Fine) ఎదుర్కొంది. బర్గర్ (Burger)లో ఎలుక వ్యర్థాలు రావడంతో ఏకంగా రూ.5 జరిమానా పడింది. ఈ సంఘటన బ్రిటన్ (UK)లో చోటుచేసుకుంది.
లండన్ (London)లోని ఓ మెక్ డొనల్డ్ ఔట్ లెట్ (Outlet)కు ఓ వినియోగదారుడు వెళ్లాడు. ఆయన చీజ్ బర్గర్ ఆర్డర్ ఇచ్చారు. కొద్దిసేపటికి సిబ్బంది బర్గర్ ఇచ్చాడు. ఆ వినియోగదారుడు తింటున్న సమయంలో బర్గర్ లో ఎలుక గుడ్ల వ్యర్థాలు కనిపించాయి. దీంతో అతడు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. వినియోగదారుడి ఫిర్యాదుతో ఔట్ లెట్ ను అధికారులు పరిశీలించగా అక్కడ దారుణ పరిస్థితులు (Filthy Conditions) కనిపించాయి.
ఔట్ లెట్ మొత్తం ఎలుకలు (Mouse), వాటి వ్యర్థాలు నిండిపోయాయి. పరిశుభ్రత లేదు. స్టాఫ్ రూమ్ (Staff Room), స్టోరేజ్ (Storage) ప్రాంతాల్లో అపరిశుభ్రత నెలకొని ఉంది. ఇది గ్రహించిన అధికారులు మెక్ డొనల్డ్స్ పై కేసు నమోదు చేశారు. విచారణ చేసిన కోర్టు (Court) మెక్ డొనల్డ్స్ కు రూ.5.14 కోట్లు (5 లక్షల పౌండ్లు) జరిమానా (Penalty) విధిస్తూ తీర్పునిచ్చింది. ఇకపై పరిశుభ్రత పాటించాలని, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించింది.