»Telangana Erra Gangireddy Surrendered In Cbi Court On Ys Viveka Murder Case
YS Viveka murder case సీబీఐ కోర్టులో లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి
వైఎస్సార్ సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది. తనను అరెస్ట్ చేస్తారనే భయంతో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకోవడంతో ఈ కేసు తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి (Erra Gangireddy) ఎట్టకేలకు కోర్టులో లొంగిపోయాడు. బెయిల్ పై బయట ఉన్న ఆయన సాక్షులను ప్రభావితం చేస్తాడని సీబీఐ (CBI) వాదించడంతో వారి వాదనతో ఏకీభవించిన కోర్టు గంగిరెడ్డిని లొంగిపోవాలని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో శుక్రవారం హైదరాబాద్ (Hyderabad) నాంపల్లి సీబీఐ కోర్టుకు వచ్చి లొంగిపోయాడు.
వివేకా హత్య కేసులో ఏ 1గా గంగిరెడ్డి ఉన్నాడు. 2019 మార్చి 28వ తేదీన పోలీసులు (Telangana Police) అతడిని అరెస్ట్ చేశారు. అరెస్టయి 90 రోజులు దాటినా చార్జ్ షీట్ (Chargesheet) దాఖలు చేయకపోవడంతో 2019 జూన్ 27న బెయిల్ (Bail) మంజూరైంది. అయితే కొన్నాళ్లకు ఈ కేసు సీబీఐ చేతిలోకి వెళ్లింది. అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో గంగిరెడ్డి వ్యవహారం కూడా అన్నే మలుపులు తిరిగాయి. ప్రస్తుతం హత్య కేసు తెలంగాణ హైకోర్టుకు (Telangana High Court) బదిలీ అయిన విషయం తెలిసిందే. గంగిరెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని సీబీఐ కోర్టులో పిటిషన్ వేసింది. సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని వాదనలు వినిపించింది. ఆ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఈనెల 5వ తేదీలోపు లొంగిపోవాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు గంగిరెడ్డి లొంగిపోయాడు.
కాగా ఈ హత్య కేసు చివరి దశకు చేరుకుంది. వైఎస్సార్ సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది. తనను అరెస్ట్ చేస్తారనే భయంతో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకోవడంతో ఈ కేసు తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. కాగా ప్రస్తుతం తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ఉండడంతో ప్రస్తుతం కేసు పురోగతి ఆగిపోయింది. వివేకా హత్య కేసు దర్యాప్తు జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.