SKLM: జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (తెలుగు, హిందీ) ప్రశాంతంగా ముగిశాయని డీఈవో పి. రవిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 929 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, వారిలో 702 మంది పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. మిగిలిన 227 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారన్నారు.