»Telangana Patronage Problem 90 Year Old Man Self Burnt In Siddipet
Potlapalli పెద్ద బలగం ఉన్నా.. తన చితి తాను పేర్చుకుని వృద్ధుడి ఆత్మహత్య
సొంత ఊరు, ఉన్న ఇంటిని వదిలి వెళ్లాలనిపించలేదు. దీంతో వెంకటయ్య ఈనెల 2న మంగళవారం గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో బస చేశారు. అక్కడ తన పరిస్థితి చెప్పి బాధపడ్డారు. తెల్లవారుజామున బుధవారం (మే 3)న నవాబుపేటకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లారు.
పెద్ద బలగం (Family) ఉన్నా కూడా ఆ పెద్దాయన ఒంటరిగా భావించాడు. కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు, కూతురు-అల్లుడు ఉన్నా ఆయనకు అండగా ఉండలేకపోయారు. తన పోషణను వంతులవారీగా (Phasewise) చేసుకున్నారు. చెరో దిక్కు వెళ్లిన పిల్లలతో నెల చొప్పున ఉండలేకపోయాడు. సొంత ఊరును.. ఉన్న ఇంటిని వదిలి వెళ్లలేక ఆ వృద్ధుడు కలత చెందాడు. పిల్లలు తన పోషణను భారంగా భావించడం.. ఊరిని వదలివెళ్లలేక లోకాన్నే వదిలేశాడు. తన చితిని తానే పేర్చుకుని ఆత్మహుతికి (Self burned) పాల్పడ్డాడు. ఈ అమానుష సంఘటన తెలంగాణలో (Telangana) చోటుచేసుకుంది. వివరాలు ఇల్లు ఉన్నాయి.
సిద్దిపేట జిల్లా (Siddipet District) హుస్నాబాద్ (Husnabad) మండలం పొట్లపల్లి (Potlapalli) గ్రామానికి చెందిన మెడబోయిన వెంకటయ్య (90)కు (Medaboina Venkataiah) నలుగురు కుమారులు కనకయ్య, ఉమ్మయ్య, పోచయ్య, ఆరయ్య, ఓ కుమార్తె ఉంది. ఆయన భార్య గతంలోనే చనిపోయింది. ఆ కుమారులు ఇద్దరు స్వగ్రామం పొట్లపల్లిలో, ఒకరు హుస్నాబాద్ లో, మరొకరు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో (Nawabpet) నివసిస్తున్నారు. తనకు ఉన్న నాలుగు ఎకరాలను పిల్లలకు పంచి ఇచ్చారు. అయితే అతడి పోషణ విషయంలో ఐదు నెలల కిందట పెద్ద మనసుల సమక్షంలో పంచాయితీ జరిగింది.
నలుగురు కుమారులు నెలకొకరు చొప్పున తండ్రి వెంకటయ్యను పోషించాలని (Patronage) పంచాయితీలో నిర్ణయించారు. ఈ క్రమంలో నెల చొప్పున గ్రామంలోని పెద్ద కుమారుడు కనకయ్య వద్ద ఉన్నాడు. నెల వంతు పూర్తి కావడంతో నవాబుపేటలో నివసించే కుమారుడి వద్దకు వెళ్లాల్సి ఉంది. సొంత ఊరు, ఉన్న ఇంటిని వదిలి వెళ్లాలనిపించలేదు. దీంతో వెంకటయ్య ఈనెల 2న మంగళవారం గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో బస చేశారు. అక్కడ తన పరిస్థితి చెప్పి బాధపడ్డారు. తెల్లవారుజామున బుధవారం (మే 3)న నవాబుపేటకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లారు. అయితే గురువారమైనా నవాబుపేటకు వెళ్లలేదు. కుమారులు ఇదే విషయమై మాట్లాడుకున్నారు. ఊరి శివారులో మంటల్లో కాలిపోయిన స్థితిలో వెంకటయ్య కనిపించాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు, కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని చూశారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ప్రజాప్రతినిధి ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన నేరుగా గ్రామంలోని ఎల్లమ్మగుట్ట వద్దకు చేరుకున్నాడు. అక్కడ తాటికమ్మలను చితిగా పేర్చుకున్నాడు. వాటిని కుప్పగా వేసి నిప్పు పెట్టాడు. అనంతరం ఆ చితిలో ఆ పెద్దాయ వెంకటయ్య దూకి ఆత్మహుతికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. కుటుంబ పోషణ లేక వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఈ సంఘటన కళ్లకు కట్టింది. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరూ ఆవేదన చెందుతున్నారు.