»Tdp Chief Nara Chandrababu Naidu Helped To Ysrcp Karyakarta College Fees
Chandrababu గొప్ప మనసు.. వైసీపీ కార్యకర్తను ఆదుకున్న వైనం..
నా కూతురు చదువు ఆగిపోతుంది అని ప్రభావతి వాపోయింది. ఇది విన్న చంద్రబాబు చలించిపోయారు. ‘మీ అమ్మాయి చదువుకు ఎంత కావాలమ్మా?’ అని చంద్రబాబు అడిగారు. అప్పటికప్పుడు చంద్రబాబు పార్టీ నాయకుల సహాయంతో రూ.2.3 లక్షలు సేకరించి వైసీపీ కార్యకర్త అయిన ప్రభావతికి అందించారు.
అధికార పార్టీ నాయకురాలు ఆమె. అకాల వర్షాలతో ఆమె పంట నీట మునిగింది. కోతకు వచ్చిన పంట నీటిపాలవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అధికార పార్టీ కావడంతో ఆమెకు ఆర్థిక సహాయం అందుతుంది అనుకుంటే పొరబడినట్టే. సీఎం జగన్ (YS Jagan) కార్యకర్తలను ఏనాడూ పట్టించుకోలేదు. ఇప్పుడు పంట నష్టం (Crop) విషయంలోనూ అదే జరిగింది. సొంత పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఆదుకోలేదు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పార్టీ ఏదనేది చూడలేదు. మానవత్వంతో స్పందించారు. పంట నష్టంతో ఆమె కూతురు చదువు ఆగిపోతుందని తెలుసుకుని వెంటనే స్పందించిన చంద్రబాబు భారీ ఆర్థిక సహాయం చేశారు. సొంత పార్టీ ఆదుకోలేదు కానీ చంద్రబాబు తనను ఆదుకున్నారని వైసీపీ కార్యకర్త పేర్కొంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
అకాల వర్షాలతో (Untimely Rains) నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు బుధవారం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో (West Godavari District) పర్యటించారు. ఏలూరు జిల్లా (Eluru District) ఉంగుటూరు పరిధిలోని తాడేపల్లిగూడెం మండలం నందమూరు (Nandumuru), తణుకు (Tanuku) సమీపంలోని దువ్వ తదితర ప్రాంతాల్లో చంద్రబాబు పంట పొలాల్లోకి (Fields) దిగి బాధిత రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉంగుటూరు (Unguturu) గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ (YCP) నాయకురాలు జువ్వలపల్లి ప్రభావతి (Juvvalapally Prabhavathi) కలిశారు. తనకు జరిగిన పంట నష్టం చంద్రబాబుకు చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘జగన్ అంటే నాకు విపరీతమైన అభిమానం. నేను వైఎసీపీ కార్యకర్తను. పార్టీ కోసం సొంత డబ్బులు కూడా ఖర్చు చేశా. అకాల వర్షాలతో నా పొలంలో ధాన్యం తడిసి మొలకలు వచ్చాయి. మా పార్టీ నాయకులు వస్తారని అనుకున్నా. కానీ ఒక్కరూ రాలేదు. చంద్రబాబు వచ్చారు’ అని ప్రభావతి వాపోయారు.
ఈ సందర్భంగా పంట నష్టంతో తాను తీవ్రంగా నష్టపోయినట్లు వాపోయింది. పంట నష్టంతో తన కూతురు (Daughter) చదువు ఆగిపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ‘ధాన్యం డబ్బులతో నా కూతురు కళాశాల ఫీజు (Collge Fees) చెల్లించాలని అనుకున్నా. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. నా కూతురు చదువు (Education) ఆగిపోతుంది’ అని ప్రభావతి వాపోయింది. ఇది విన్న చంద్రబాబు చలించిపోయారు. ‘మీ అమ్మాయి చదువుకు ఎంత కావాలమ్మా?’ అని చంద్రబాబు అడిగారు. అప్పటికప్పుడు చంద్రబాబు పార్టీ నాయకుల సహాయంతో రూ.2.3 లక్షలు సేకరించి వైసీపీ కార్యకర్త అయిన ప్రభావతికి అందించారు. కూతురు చదువు ఆగకుండా చూసుకోవాలని చెప్పారు. కాగా పార్టీకి అతీతంగా చంద్రబాబు సహాయం (Help) చేయడం జిల్లాలో ఆసక్తికరంగా మారింది.
మతం చూడం, కులం చూడం, పార్టీ చూడం అంటూ అందరికీ కీడు చేసిన జగన్ ఎక్కడ… కష్టం చెప్పుకోగానే తనకు ఏనాడూ మద్దతు పలకని వైసీపీ కార్యకర్త అని తెలిసి కూడా అప్పటికప్పుడు మానవత్వంతో సాయం చేసిన @ncbn గారు ఎక్కడ. ఇకపై టీడీపీ నుండి పిలుపొస్తే తినే అన్నం వదిలేసి మరీ వస్తానన్న మహిళ pic.twitter.com/HrOXzzfT1W