టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట బొప్పూడి లో ఏర్పాటు చేసిన ప్రజగళం బహిరంగ సభకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మూడు పార్టీలకు సంబంధించిన అభిమానులు పెద్ద ఎత్తున సభకు తరలివచ్చారు.
PM Modi : టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట బొప్పూడి లో ఏర్పాటు చేసిన ప్రజగళం బహిరంగ సభకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మూడు పార్టీలకు సంబంధించిన అభిమానులు పెద్ద ఎత్తున సభకు తరలివచ్చారు. ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారమంటూ తెలుగులో ప్రధాని మోడీ ప్రసంగాన్ని ప్రారంభించారు. నిన్ననే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.. నాకు ఇక్కడ కోటప్పకొండ దగ్గర త్రిమూర్తుల ఆశీర్వాదం లభిస్తోందన్నారు. ఎన్డీయేకు 400 సీట్లు దాటాలి, మాకు ఓటు వేయాలి అని తెలుగు ఓటర్లు ప్రధాని కోరారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ చంద్రబాబు చేరికతో ఎన్డీయే బలం మరింత బలపడిందన్నారు. చంద్రబాబు, పవన్ ఏపీ కోసం కష్టపడుతున్నారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధిలో దూసుకుపోతుంది. జూన్ 4న ఫలితాల్లో ఎన్డీయేకు 400 సీట్లు దాటాలి. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే మన లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. పేదల కోసం ఆలోచించేది ఎన్డీయే ప్రభుత్వమే.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారు.
ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి ఆధారంగానే ఎన్డీయే ముందుకు వెళ్తోందని ప్రధాని మోడీ తెలిపారు. ఎన్నో విద్యాసంస్థల్ని కేంద్రం ఏపీకి కేటాయించింది.. తిరుపతిలో ఐఐటీ, కర్నూలులో ఐఐఐటీ, విశాఖలో ఐఐఎం, మంగళగిరికి ఎయిమ్స్ కేటాయించామన్నారు. ఎన్డీయేలో మేము అందరినీ కలుపుకొని వెళ్తాం.. ఎన్నికలకు ముందే ఇండియా కూటమిలో పార్టీలు గొడవ పడుతుంటే, తర్వాత ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.. అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్ట రోజున తెలుగు ప్రజలు ఎంతో ఆనందించారు.. ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడి పాత్రలతో మెప్పించారు.. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పోరాడారని ప్రధాని మోడీ అన్నారు.