»Ap 3 Year Old Boy Killed By Battery Vehicle In Sv Zoo Park Tirupati
Tirupati జూపార్క్ లో విషాదం.. బ్యాటరీ కారు ఢీకొని బాలుడి మృతి
అంతసేపు తమతో ఆడుకుంటున్న పిల్లాడు అంతలోనే కన్నుమూయడంతో ఆ తల్లి (Mother) కన్నీరుమున్నీరుగా విలపించింది. కాగా బ్యాటరీ వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం వలన ఈ ప్రమాదం జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
జూపార్క్ లో (Zoo Park) అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. బ్యాటరీ వాహనం (Battery Vehicle) ఢీకొని ఓ చిన్నారి మృతి చెందాడు. ఆనందంగా విహరించేందుకు రాగా ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఈ సంఘటన ఏపీలోని తిరుపతిలో (Tirupati) చోటుచేసుకుంది. నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తిరుపతి పట్టణంలోని రాయల్ నగర్ కు చెందిన మనోజ్ బెంగళూరులోని (Bengaluru) ఓ ప్రైవేటు కళాశాలలో పని చేస్తున్నారు. ఆయనకు భార్య సుష్మ, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ప్రణవ్ నారాయణ (3) ఉన్నాడు. భర్త ఉపాధి కోసం బెంగళూరులో ఉండగా భార్య పిల్లలతో కలిసి తిరుపతిలో నివసిస్తోంది. వేసవి సెలవులు కావడంతో ఇంట్లో ఖాళీగా ఉండలేక సుష్మ పిల్లలను తీసుకుని ఎస్వీ జూపార్క్ (Sri Venkateswara Zoological Park) సందర్శనకు తీసుకువచ్చింది. జూపార్క్ లో జంతువులు (Animals), ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా బ్యాటరీ వాహనం దూసుకొచ్చింది. చిన్నారిపైకి వాహనం చక్రాలు ఎక్కాయి. దీంతో ప్రణవ్ నారాయణ తీవ్ర గాయాలపాలయ్యాడు. జూపార్క్ సిబ్బంది, కుటుంబసభ్యులు వెంటనే రుయా ఆస్పత్రికి (RUIA Hospital) తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
అంతసేపు తమతో ఆడుకుంటున్న పిల్లాడు అంతలోనే కన్నుమూయడంతో ఆ తల్లి (Mother) కన్నీరుమున్నీరుగా విలపించింది. కాగా బ్యాటరీ వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం వలన ఈ ప్రమాదం జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు వాహనం డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. కాగా, జూపార్క్ అధికారులు తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ముత్యాలరెడ్డి పల్లి పోలీసులు (Muthyalareddipalli Police) తెలిపారు.