»Telangana Dalit Bandhu Sanctioned To Balagam Mogilaiah
Dalit Bandhu ‘బలగం’ మొగిలయ్యకు దళిత బంధు.. ఇక హాయిగా జీవితం
మొగిలయ్య కిడ్నీ సమస్యతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని వెంటనే స్పందించి నిమ్స్ లో చేర్పించి మెరుగైన వైద్యం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కుటుంబానికి చేయూతనందించాలనే ఉద్దేశంతో దళిత బంధు పథకాన్ని మంజూరు చేయించినట్లు చెప్పారు.
తెలంగాణ (Telangana) అనుబంధాల ఇతివృత్తంలో వచ్చిన ‘బలగం’ సినిమా (Balagam Movie)లో తెలుగు ప్రజలను ఆకట్టుకుంది. ఈ సినిమా ‘తోడుగా మాతోడుండి’ (Thoduga Ma Thodundi Song) అంటూ పాడి ప్రేక్షకుల్లో కన్నీళ్లు తెప్పించిన బుడగజంగాల కళాకారుడు మొగిలయ్య (Pastam Mogilaiah)కు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఆయన అనారోగ్యం బారిన పడితే వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించింది. అతడికి ప్రత్యేకంగా వైద్య సేవలు అందించారు. తెలంగాణ మంత్రులు హరీశ్ రావు (T Harish Rao), కేటీఆర్ వెంటనే వైద్య సదుపాయం కల్పించారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకం అందించింది.
వరంగల్ జిల్లా (Warangal District) దుగ్గొండికి చెందిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య, కొమురమ్మ (Komuramma) బలగం సినిమాతో వెలుగులోకి వచ్చారు. ఆ దంపతులు బుర్రకథలు చెబుతూ జీవనం పొందుతున్నారు. మొగిలయ్య అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆ కుటుంబం ఎన్నో కష్టాలు అనుభవిస్తోంది. వైద్యానికి అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా దళిత బంధు పథకం కూడా మంజూరు చేసింది. మొగిలయ్య కుటుంబానికి నర్సంపేట (Narsampet) బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అండగా నిలిచారు.
నర్సంపేటలోని తన క్యాంపు కార్యాలయానికి మొగిలయ్యను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (Peddi Sudharshan Reddy) పిలిపించుకుని యోగక్షేమాలు ఆరా తీశారు. అనంతరం మొగిలయ్య దంపతులను ఎమ్మెల్యే దంపతులు సత్కరించారు. ఈ సందర్భంగా దళితబంధు మంజూరు పత్రాలను వారికి అందించారు. దళితబంధు పథకం కింద మొగిలయ్యకు రూ.10 లక్షల నగదు సహాయం అందనుంది. ఆ డబ్బులతో ఆర్థికంగా చేదోడుగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.
‘ఇటీవల విడుదలై ఎంతో ప్రజాదరణ పొందుతున్న బలగం సినిమాలో బంధుత్వాలను గురించి చివరి పాట పాడి అందరి హృదయాలు గెలుచుకున్న నర్సంపేట నియోజకవర్గానికి చెందిన బుడగ జంగాల కళాకారులు పస్తం మొగిలయ్య గారి దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ సహకారంతో మంజూరు చేయించాం’ అని ఎమ్మెల్యే ట్వీట్ చేశారు. మొగిలయ్య కిడ్నీ సమస్యతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని వెంటనే స్పందించి నిమ్స్ లో చేర్పించి మెరుగైన వైద్యం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కుటుంబానికి చేయూతనందించాలనే ఉద్దేశంతో దళిత బంధు పథకాన్ని మంజూరు చేయించినట్లు చెప్పారు. మొగిలయ్య కుటుంబానికి ఏ ఆపద వచ్చినా, ఎప్పుడైనా సరే, తనను సంప్రదించవచ్చని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భరోసా ఇచ్చారు.
కాగా మొగిలయ్య రెండు కిడ్నీలు చెడిపోయాయి. ఆయన రోజు విడిచి రోజు డయాలసిస్ (Dialysis) చేయించుకోవాలి. దీనికి తోడు మధుమేహం (Sugar), బీపీ (BP) ఉంది. వీటి ప్రభావంతో అతడి చూపుపై ప్రభావం పడింది. అనారోగ్యం వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ప్రత్యేక శ్రద్ధతో మొగిలయ్యకు నిమ్స్ లో వైద్యం అందించిన విషయం తెలిసిందే.
ఇటీవల విడుదలై ఎంతో ప్రజాదరణ పొందుతున్న #బలగం సినిమాలో బంధుత్వాలను గూర్చిన చివరి పాట పాడి అందరి హృదయాలు గెలుచుకున్న నర్సంపేట నియోజకవర్గానికి చెందిన బుడగ జంగాల కళాకారులు పస్తం మొగిలయ్య గారి దళిత బంధు పథకాన్ని గౌరవ @TelanganaCMO గారి సహకారంతో మంజూరు చేయించడం జరిగింది. pic.twitter.com/ZQGXIR4pYG