»Nara Bhuvaneshwari Said That The Ap Governments Attitude Towards Kollu Ravindra Is Very Hurtful
Nara Bhuvaneswari: కొల్లు రవీంద్రపై పోలీసుల ప్రవర్తన బాధాకరం
టీడీపీ పొలిట్ బ్యూరో, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోనికి తీసుకుని.. ఆరోజు రాత్రి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. తర్వాతి రోజు కూడా గృహనిర్భంధంలో ఉంచారు. తల్లి వర్ధంతి ఉందని చెప్పిన వినిపించుకోకుండా ఇబ్బందిపెట్టారు. రవీంద్ర విషయంలో ప్రభుత్వ వైఖరి తనను ఎంతో బాధించిందని నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.
Nara Bhuvaneswari: టీడీపీ పొలిట్ బ్యూరో, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను గృహనిర్భంధం చేయడంపై నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి వర్ధంతి కార్యక్రమాలకు కూడా వెళ్లనివ్వరా? దేశంలో మరెక్కడైనా ఇలా ఉంటుందా? ఇదేమి చట్టం? ఇదెక్కడి న్యాయం? అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొల్లు రవీంద్రను మంగళవారం కూడా పోలీసులు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా నిర్భందించారు. తన తల్లి వెంకట సౌభాగ్యవతి వర్ధంతి ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని అన్నారు.
తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసు నిర్భంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. తల్లి వర్ధంతి కార్యక్రమాలకు కూడా వెళ్లనీయకుండా ఒక మాజీ మంత్రిని అడ్డుకోవడం దేశంలో మరెక్కడైనా ఉంటుందా? ఇదేమి చట్టం… ఇదెక్కడి న్యాయం? కొల్లు రవీంద్ర గారి పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి నన్ను ఎంతో… pic.twitter.com/syGf26aUtm
బంధువులు, సన్నిహితులు ఎవరిని ఇంట్లోకి అనుమతించలేదు. ఉదయం ఇంట్లోకి పాలు తీసుకెళ్లనివ్వలేదు. పీఏ, డ్రైవర్ల పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించారు. వ్యవస్థల నిర్వీర్యం అని చంద్రబాబు ఎందుకు ఆందోళన వ్యక్తం చేసేవారో ఈ ఘటన చూస్తే అర్థం అవుతుంది. కుటుంబ వ్యవహారాలను, వ్యక్తిగత హక్కులను, సంప్రదాయాలను రాజకీయాలతో ముడి పెట్టవద్దని భువనేశ్వరి ఉన్నతాధికారులను కోరారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల నిర్భంధం తీవ్ర ఆవేదన కలిగిస్తుందని అన్నారు.