ఫిట్నెస్ విషయంలో బాలీవుడ్ సెలబ్రిటీల అందరి కంటే ఓ అడుగు ముందే ఉంటాడు స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan). 49 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తూ కండలు తిరిగిన దేహంతో తనకు తానే సాటి నిరూపించుకుంటున్నాడు. అందంతో, అదరగొట్టే డ్యాన్సులతో అభిమానుల మనసు కొల్లగొట్టే.. ఈ ‘గ్రీక్‌గాడ్ (Greek God)’కు సంబంధించిన ఓ ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ షర్ట్‌లెస్ ఫొటోపై చేసిన కామెంట్ అభిమానులను మరింతగా ఆకర్షిస్తోంది.
అయితే, ఈ సారి కేవలం ఐదు వారాల్లోనే ఆయన పోయిన సిక్స్ ప్యాక్(Six pack)ను సొంతం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఆగస్టు 31న కాస్తంత పొట్టతో బొద్దుగా కనిపించిన హృతి అక్టోబర్ 7 కల్లా సిక్స్ ప్యాక్ తెచ్చుకున్నారు. ఈ ప్రయాణాన్ని సంక్షిప్తంగా వివరిస్తూ నెట్టింట ఆయన పెట్టిన పోస్ట్ వైరల్‌గా (post viral) మారింది. ఈ మిషన్‌లో మోకాళ్లు, భుజాలు, వెన్ను మెదడు అన్నీ సహకరించాయి. ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకుని కోలుకుని, కొత్త సమతౌల్యం సాధించాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు
ఈ జర్నీలో అత్యంత కష్టమైన పని.. ఫ్రెండ్స్(friends), బంధువులు, పార్టీలకు నో చెప్పడంరాత్రి 9 కల్లా నిద్రకు ఉపక్రమించడం కూడా ఓ మొస్తరు ఇబ్బందేక్రిస్ గెథిన్ లాంటి మెంటార్ దొరకడం నిజంగా అద్భుతం. ఆయన అనుభవం, నైపుణ్యాలు ఎంతోఉపయోగపడ్డాయి. ఇక స్వప్నిల్ హజారే (Swapnil Hazare) లేకుండా ఇదంతా సాధ్యమయ్యేదే కాదు. నా టీంకి కూడా ధన్యవాదాలు. వారు వెన్నంటి ఉండటంతోనే అనుకున్నది సాధించా’’ అంటూ హృతిక్ ఇన్‌స్టా(Insta)లో ఓ ట్వీట్ చేశారు. సినిమాలోని తన క్యారెక్టర్ అవసరాలకు తగట్టు శారీరక ధారుఢ్యాన్ని మార్చుకుంటానని హృతిక్ చెప్పుకొచ్చారు. తన సెల్ఫ్ వర్త్ తన రూపురేఖలపై ఆధారపడి ఉండదని కూడా స్పష్టం చేశారు.