»Chaka Penguin Becomes First In World To Undergo Mri Scan In Uk
MRI Scan చేసుకున్న పెంగ్విన్ పక్షి.. వైద్య చరిత్రలోనే తొలిసారి
ఈ పరీక్షలకు ఆ పెంగ్విన్ పూర్తిగా సహకరించింది. స్కానింగ్ చేయించుకుంటున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే పరీక్షల అనంతరం పెంగ్విన్ యథావిధిగా నడుస్తోంది. ప్రస్తుతం దాని పరిస్థితి మెరుగైంది.
శరీరంలో (Body) ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అందుకే వైద్యులు (Doctors) ఏడాదికి రెండుసార్లు, లేదా ఒకసారైనా మొత్తం వైద్య పరీక్షలు (Health Checkups) చేయించుకోవాలని సూచిస్తారు. పొంచి ఉన్న వ్యాధులు వైద్య పరీక్షల్లో బయటపడతాయి. వైద్య పరీక్షలు అనేవి మనుషులకు తప్పనిసరి. అయితే ఈ పరీక్షలు ఒక్క మనుషులకే కాదు పశుపక్ష్యాదులకు (Animals) కూడా చేయిస్తున్నారు. ఇన్నాళ్లు పెంపుడు జంతువులు కుక్క (Dog), పిల్లి (Cat) తదితర జంతువులకు చేయగా.. తొలిసారిగా పెంగ్విన్ (Penguin) పక్షికి ఎమ్మారై స్కానింగ్ చేయించారు. వైద్య చరిత్రలోనే తొలిసారిగా ఓ పక్షికి స్కానింగ్ (MRI Scan) చేయడం తొలిసారి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
యూకేలోని (United Kingdom) లోని వేమౌత్ అడ్వైంచర్ పార్క్ (SEA LIFE Weymouth Aquarium Centre)లో ‘చకా’ (Chaka) అనే పెంగ్విన్ (Penguin) పక్షి ఉంది. కొద్ది రోజులుగా ఆ పక్షి అస్వస్థతకు గురైంది. సక్రమంగా నిలబడకపోవడం.. కదలకపోవడంతో పార్క్ అధికారులు గుర్తించారు. వెటర్నరీ వైద్యులు (Veterinary) పరీక్షలు చేశారు. అయితే సమస్య ఏమిటో తెలియకపోవడంతో ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలని నిర్ణయించారు. వెంటనే చకాను ల్యాబ్ లోకి తీసుకెళ్లి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించారు. ఈ పరీక్షలకు ఆ పెంగ్విన్ పూర్తిగా సహకరించింది. స్కానింగ్ చేయించుకుంటున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే పరీక్షల అనంతరం పెంగ్విన్ యథావిధిగా నడుస్తోంది. ప్రస్తుతం దాని పరిస్థితి మెరుగైంది. అయితే పరీక్షల ఫలితాల్లో పెంగ్విన్ కు ఏమైంది అనేది తెలియడం లేదు. కాగా, ఎంఆర్ఐ పరీక్ష చేసుకున్న తొలి పక్షిగా చకా రికార్డు సృష్టించింది.