మలి వయసులోనూ తండ్రి కాబోతున్నాడు బ్రిటన్ (Britain) మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ (Boris Johnson). అది కూడా ఏకంగా 8వ బిడ్డకు తండ్రి కానున్నాడు. ఈ విషయాన్ని ఆయన భార్య సోషల్ మీడియా (Social Media) ద్వారా ప్రకటించింది. ఈ వార్త నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. మరి కొన్ని వారాల్లో మా జట్టులోకి కొత్త సభ్యుడు రాబోతున్నాడంటూ జాన్సన్ మూడో భార్య ప్రకటించింది.
బోరిస్ జాన్సన్ మూడో భార్య క్యారీ సిమండ్స్ (35) (Carrie Symonds). కొన్నేళ్ల సహజీవనం (Dating) అనంతరం 2021 మేలో వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏప్రిల్ 2020లో విల్ఫ్ (Wilf), 2021 డిసెంబర్ లో రోమీ (Romy) జన్మించారు. తాజాగా సిమండ్స్ మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నది. ‘కొన్ని వారాల్లో జట్టులోకి కొత్త సభ్యుడు రాబోతున్నాడు. చిన్నారిని చూసేందుకు 8 నెలల నుంచి చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’ అని క్యారీ సిమండ్స్ ఇన్ స్టాగ్రామ్ (Instagram)లో పోస్టు చేసింది. దీనికి రెండు ఫొటోలు కూడా జత చేసింది.
కాగా, బోరిస్ జాన్సన్ కు మొత్తం ముగ్గురు భార్యలు (Wife). 1987లో కళాకారిణి, జర్నలిస్ట్ అలెగ్రా మోస్టిన్ ఓవెను వివాహం చేసుకోగా వీరికి సంతానం కలగలేదు. కొన్నాళ్లకు వీరు విడిపోయారు. 1993లో భారత సంతతికి చెందిన న్యాయవాది, జర్నలిస్ట్ మెరినా వీలర్ (Merina Wheeler)ను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు సంతానం. 25 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి 2018లో విరామం ప్రకటించారు. ఇక ఆర్ట్ కన్సల్టెంట్ హెలెన్ మాకిన్ టైర్ (Helen Makin Tire)తో సంబంధం ఉంది. ఆమెను పెళ్లి చేసుకోకపోగా కానీ ఆమెతో ఓ బిడ్డకు జన్మనిచ్చాడు.