HNK: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి-బరౌని మధ్య రెండు వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే CPRO శ్రీధర్ ఇవాళ తెలిపారు. రేపు చర్లపల్లి-బరౌని ఎక్స్ప్రెస్ (07093), 27న బరౌని-చర్లపల్లి ఎక్స్ప్రెస్ (07094) నడుస్తాయి. ఈ రైళ్లలో సెకండ్, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్లు ఉంటాయి. కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాలలో ఆగుతాయి.