»Hyderabad Drunked Tamil Dancers Throne Watchman From Third Floor In Bajara Hills
Watchman:ను భవనంపై నుంచి తోసేసిన డ్యాన్సర్లు
భవనానికి కాపలా కాస్తున్న వాచ్ మెన్ యాదగిరికి లాడ్జి సిబ్బంది చెప్పారు. డ్యాన్సర్లను రోజూ వచ్చి అలా చేయొద్దని వాచ్ మెన్ చెబుతున్నాడు. అయినా కూడా వారిలో మార్పు ఉండడం లేదు. గురువారం రాత్రి కూడా ఆ డ్యాన్సర్లు రచ్చ చేస్తుండడంతో వాచ్ మెన్ యాదగిరి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. బస చేసేందుకు వచ్చిన డ్యాన్సర్లు (Dancers) మద్యం మత్తులో భవనం వాచ్ మెన్ (Watchman)పై దాడికి పాల్పడ్డారు. ఆ మైకంలో వాచ్ మెన్ ను భవనంపై (Building) నుంచి కిందకు తోసేశారు. దీంతో మూడో అంతస్తుల పై నుంచి కిందపడిపోవడంతో వాచ్ మెన్ తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ఈ సంఘటనతో తేరుకున్న డ్యాన్సర్లు భయాందోళన చెందారు. వెంటనే గెస్ట్ హౌజ్ నుంచి పారిపోయారు. కాగా ఆ డ్యాన్సర్లు తమిళనాడు (Tamil Nadu) నుంచి వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ సంఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ (Banjarahills Police) పరిధిలో చోటుచేసుకుంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం..
బంజారాహిల్స్ ఇందిరానగర్ (Indra Nagar)లోని రాఘవ గెస్ట్ హౌస్ (Raghava Guest House)లో చెన్నైకి (Chennai) చెందిన నలుగురు మణి, దిన, నరేశ్, నాగరాజు అనే డ్యాన్సర్లు బస చేశారు. కొన్ని రోజులుగా డ్యాన్సర్లు లాడ్జిలోనే ఉంటున్నారు. అయితే లాడ్జిలో మద్యం (Liqour) సేవిస్తూ బీభత్సం చేస్తున్నారు. మద్యంమత్తులో నానా హంగామా చేస్తున్నారు. ఈ విషయాన్ని భవనానికి కాపలా కాస్తున్న వాచ్ మెన్ యాదగిరికి లాడ్జి సిబ్బంది చెప్పారు. డ్యాన్సర్లను రోజూ వచ్చి అలా చేయొద్దని వాచ్ మెన్ చెబుతున్నాడు. అయినా కూడా వారిలో మార్పు ఉండడం లేదు. గురువారం రాత్రి కూడా ఆ డ్యాన్సర్లు రచ్చ చేస్తుండడంతో వాచ్ మెన్ యాదగిరి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో వారి మధ్య వాగ్వాదం మొదలైంది.
తరచూ తమను నిలదీస్తున్న వాచ్ మెన్ పై ఆ నలుగురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో క్షణికావేశంలో యాదగిరిని మూడో అంతస్తు (Third Floor) నుంచి కిందకు తోసి వేశారు. ఈ ఘటనలో యాదగిరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన నరేశ్, నాగరాజు పరారవగా.. మణి, దిన పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం యాదగిరి కుటుంబసభ్యులకు అప్పగించారు. మిగిలిన ఇద్దరు నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు (Police) తెలిపారు.