»Telangana 8 Years Old Boy Died In Street Dogs Attack At Kazipet
Street Dogs వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృతి.. బహిర్భూమికి వెళ్లగా దాడి
హిర్భూమి కోసం చోటూ చెట్ల పొదల్లోకి వెళ్లాడు. కాగా అక్కడ వీధికుక్కల గుంపు ఉంది. అకస్మాత్తుగా ఆరు కుక్కలు చోటుపై దాడి చేశాయి. తప్పించుకునే క్రమంలో బాలుడి దుస్తులు చెట్టుకు చిక్కుకోవడంతో వాటి నుంచి తప్పించుకోలేకపోయాడు.
వీధి కుక్కలు (Street Dogs) స్వైర విహారం చేస్తున్నాయి. రెండు నెలల కిందట ఓ చిన్నారి (Child Boy) కుక్కల దాడిలో మృతి చెందిన సంఘటన మరువకముందే మరో చోట అలాంటి సంఘటన చోటుచేసుకుంది. హన్మకొండ జిల్లా (Hanumakonda District) కాజీపేటలో వీధికుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. బహిర్భూమికి వెళ్లిన పిల్లాడిపై దాడి చేశాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) కు చెందిన సునీత, మల్కాన్ దంపతులు పొట్టకూటి కోసం గురువారం కాజిపేటకు (Kazipet) చేరుకున్నారు. పట్టణంలోని రైల్వే క్వార్టర్స్ సమీపంలో ఉన్న పార్క్ వద్దకు వచ్చి గుడిసె వేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు చోటూ (8) ఉన్నాడు. శుక్రవారం ఉదయం బహిర్భూమి కోసం చోటూ చెట్ల పొదల్లోకి వెళ్లాడు. కాగా అక్కడ వీధికుక్కల గుంపు ఉంది. అకస్మాత్తుగా ఆరు కుక్కలు చోటుపై దాడి చేశాయి. తప్పించుకునే క్రమంలో బాలుడి దుస్తులు చెట్టుకు చిక్కుకోవడంతో వాటి నుంచి తప్పించుకోలేకపోయాడు. చెట్టుకు చిక్కుకున్న చోటుపై కుక్కలు తీవ్రంగా గాయపర్చాయి. తెల్లవారుజామున కావడంతో ఎవరూ అటువైపు రాకపోవడంతో అది గ్రహించలేకపోయారు. అచేతనంగా బాలుడు అక్కడే ఉండిపోయాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు.
తమ కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు బయటకు వచ్చి చూడగా ఈ దారుణం వెలుగు చూసింది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు మృతదేహం అప్పగించారు. కాగా ఈ సంఘటన విషయం తెలుసుకున్నచీఫ్ విప్ ధాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhasker) ఆస్పత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.