»Several Trains Have Been Canceled In Kazipet Vijayawada Route Till The December 18th
Several trains canceled: కాజీపేట-విజయవాడ రూట్లలో ఈనెల 18 వరకు పలు ట్రైన్స్ రద్దు
కాజీపేట-విజయవాడ రూట్లలో(Kazipet-Vijayawada route) ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు అలర్ట్. ఎందుకంటే ఈ రూట్లలో ఈనెల 18 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అయితే ఆ ట్రైన్స్ ఎంటి ? ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
Several trains have been canceled in Kazipet-Vijayawada route till the december 18th
కాజీపేట-విజయవాడ మార్గంలో(Kazipet-Vijayawada route) ఈనెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పలు ట్రైన్లు రద్దు కానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. వాటిలో సికింద్రాబాద్-విజయవాడ శాతవాహన ఎక్స్ ప్రెస్ ఈనెల 7వ తేదీతోపాటు 10 నుంచి 18 వరకు రద్దు కానుందని తెలిపారు. సికింద్రాబాద్-భద్రాచలం రూట్లోని కాకతీయ ఎక్స్ ప్రెస్ కూడా ఈనెల 6వ తేదీతోపాటు 10 నుంచి 18 వరకు, ఆదిలాబాద్-తిరుపతి కృష్ణా ఎక్స్ ప్రెస్ ను కూడా ఈనెల 5 నుంచి 19 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
వీటితోపాటు కాజీపేట-డోర్నకల్, డోర్నకల్-విజయవాడ ప్యాసింజర్ ట్రైన్ పుష్ పుల్ కూడా ఈనెల 10 నుంచి 18 వరకు, కాజీపేట-తిరుపతి, లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్లే గౌతమి ట్రైన్ ఈనెల 10 నుంచి 18 వరకు రద్దు చేశారు. అంతేకాదు గోల్కొండ ఎక్స్ ప్రైస్ ఈనెల 10 నుంచి 19 వరకు కాజీపేట వరకు మాత్రమే ప్రయాణిస్తుందని అధికారులు వెల్లడించారు. ఇక భద్రాచలం రోడ్ నుంచి బల్లార్షా వెళ్లే సింగరేణి ఎక్స్ ప్రెస్ ఈనెల 6 నుంచి 8 వరకు, 10 నుంచి 19 వరకు హసన్ పర్తి రోడ్ వరకు మాత్రమే ప్రయాణిస్తుందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. అయితే కాజీపేట-వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య మూడో లైన్ పనులు జరుగుతున్న కారణంగా ఈ రైళ్లను(trains) తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రూట్లలో ప్రయాణించే ప్రయాణికులు రద్దు చేసిన ట్రైన్ల వివరాలను తెలుసుకుని ప్రయాణం చేయాలని సూచించారు.