Nara Lokesh: వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అనంతపురంలో శంఖారావం సభ నిర్వహించారు. ఈ సభలో లోకేశ్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతను సీఎం మోసం చేశారన్నారు. కొత్త నోటిఫికేషన్లు వస్తాయని యువత ఆశగా ఎదురుచూస్తున్నారని.. కానీ సీఎం జగన్ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయట్లేదని లోకేశ్ అన్నారు.
సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి.. మాట తప్పింది జగన్ కదా? అని లోకేశ్ ప్రశ్నించారు. ఐదేళ్లు జగన్ ఏం చేశారో నిలదీయాలని ప్రజలను కోరారు. ఐదేళ్లలో చేయని పనులు ఇప్పుడే జగన్‌కు గుర్తుకొస్తున్నాయని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో 100 సంక్షమ పథకాలను జగన్ రద్దు చేశారు. పథకాలన్నీ రద్దు చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని లోకేశ్ అన్నారు. ఈ ఐదేళ్లలో నిత్యావసర సరుకులు, అన్ని ఛార్జీలను పనికట్టుకుని మరి పెంచారని లోకేశ్ అన్నారు.