Surya Kiran: సీనియర్ హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త, దర్శకుడు సూర్య కిరణ్ మరణించారు. చెన్నైలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా పచ్చ కామెర్ల వ్యాధి బారిన పడ్డారు. దానికై చికిత్స తీసుకుంటుండగా గుండెపోటు కూడా వచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. సూర్య కిరణ్ తెలుగులో సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజుభాయ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. కేరళాకి చెందిన ఈయన మలయాళ సినిమాలతో కెరీర్‌ని ప్రారంభించారు. 1978లో స్నేహిక్కన్ ఓరు పెన్ను చిత్రంలో మంచి పేరు వచ్చింది. అలా కన్నడ, తమిళంలో కూడా నటించారు. తెలుగులోకి 1986లో చిరంజీవి హీరోగా నటించిన రాక్షసుడు చిత్రంతో తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు. దొంగమొగుడు, సంకీర్తన, ఖైదీ నెం 786, కొండవీటి దొంగ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. కొన్నాళ్ల క్రితం బిగ్ బాస్‌లో కూడా పాల్గొన్నారు. తరువాత పెద్దగా పరిశ్రమలో యాక్టీవ్‌గా లేరు.