Six people were killed in one family nizamabad telangana
తెలంగాణలో ఇటివల నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పరీక్షను మళ్లీ నిర్వహించాలని తెలిపింది. జూన్ 11న రెండో సారి నిర్వహించిన ఈ పరీక్షకు 2.32 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. అయితే పరీక్ష నిర్వహణ తీరు సరిగా లేదని, బయోమెట్రిక్ వివరాలు కూడా తీసుకోలేదని పలువురు హైకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాదు హాల్ టిక్కెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలపై విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే రాష్ట్రంలో రెండోసారి గ్రూప్ 1 పరీక్షలు రద్దు కావడంతో ప్రభుత్వ నిర్వహణ తీరుపై విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు ఈ పరీక్ష తర్వాత నిర్వహించిన గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా ఇలాగే నిర్వహించారని మరికొంత మంది అభ్యర్థులు వాపోతున్నారు.