నేషనల్ వెదర్ సర్వీస్ న్యూస్ ప్రకారం అగ్రరాజ్యం అమెరికా(America)లో వేల కొద్ది విమాన(flights) సర్వీసులు రద్దయ్యాయి. పిడుగులతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉన్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అగ్రరాజ్యం అమెరికా(America)లో పిడుగులతో కూడిన వర్షాలు వస్తున్న క్రమంలో 2,600 విమానాలను ఆదివారం రద్దు చేశారు. దీంతోపాటు దాదాపు 8,000 విమానాలు ఆలస్యంగా ప్రయాణించాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రకారం, ఈ రద్దులు, జాప్యాలలో ఎక్కువ భాగం ఈశాన్య ప్రాంతం నుంచి ఉన్నట్లు పేర్కొన్నారు. న్యూజెర్సీలోని నెవార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 1320 విమానాలు రద్దు చేయబడ్డాయి. తీవ్రమైన వాతావరణం కారణంగా జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయం, లా గార్డియన్ విమానాశ్రయాలలో పలు సర్వీసులను నిలిపివేసినట్లు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో విమానాశ్రయానికి వెళ్లే ముందు విమాన(flights) సమయం, వాతావరణ పరిస్థితిని తనిఖీ చేసుకోవాలని ప్రయాణికులకు అధికారులు సూచించారు. JFKలో 426 ఆలస్యమైనప్పుడు 318 విమానాలు రద్దు చేయబడ్డాయి. లా గార్డియాలో 270 రద్దు చేయబడ్డాయి. 292 ఆలస్యమయ్యాయి. బోస్టన్ లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 259 విమానాలు రద్దు చేయబడ్డాయి, 459 ఆలస్యమయ్యాయి. ఈశాన్య యునైటెడ్ స్టేట్స్లో భారీ వర్షాలు, అనేక రాష్ట్రాల్లో వరదలు కొనసాగుతున్నాయి. దీంతోపాటు న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, పెన్సిల్వేనియా, మసాచుసెట్స్, వెర్మోంట్లోని కొన్ని ప్రాంతాలకు వరద హెచ్చరికలు కూడా జారీ చేశారు.