ప్రపంచంలో వాళ్లిద్దరూ దిగ్గజ వ్యాపారవేత్తలు, ప్రముఖ టెక్ కంపెనీల అధిపతులు ఎలాన్ మస్క్(Elon Musk), మార్క్ జుకర్‌బర్గ్ ఇద్దరు తమ పోటీ కారణంగా తరుచుగా వార్తల్లో నిలిచారు. అప్పటి నుంచి ఎలన్ మస్క్, జుకర్ బర్గ్ (Zuckerberg) మధ్య బయటకు కనిపించని యుద్ధం కొనసాగుతూనే ఉంది. జుకర్ని కవ్విస్తూ కొన్ని సెటైరికల్ ట్వీట్లు చేశాడు మస్క్. జుకర్ బర్గ్ కాపీ క్యాట్ (Copycat) అంటూ కొందరు గట్టిగానే విమర్శిస్తుంటే…ఆ కామెంట్స్‌ని ఎంజాయ్ చేశాడు మస్క్. ఇద్దరి మధ్య వైరం పెరుగుతున్న క్రమంలోనే సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. AI జనరేటెడ్ పిక్స్‌ని చూసి నెటిజన్లు “వావ్” అంటున్నారు.
ఇంతకీ అందులో ఏముందంటే…ఎలన్ మస్క్, జుకర్ బర్గ్ కలిసి బీచ్(beach)లో ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకుని సముద్ర తీరంలో నడుస్తున్నారు. సడెన్‌గా చూస్తే ఇది నిజమేనేమో అనుకునేంత సహజంగా ఉన్నాయి ఈ AI ఫొటోలు. మరో హైలైట్ ఏంటంటే…జుకర్ బర్గ్, ఎలన్ మస్క్ ఒకరినొకరు హగ్ చేసుకున్న ఫొటో .కూడా ఇందులో కనిపించిందిరు. సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ట్విటర్‌కు పోటీగా జుకర్‌బర్గ్ థ్రెడ్స్‌ను (Threads) తీసుకురావటం వివాదాన్ని రాజేసింది. పైగా ట్విటర్ వ్యాపార రహస్యాలు, ఇతర మేధో సంపత్తిని చట్టవిరుద్ధంగా దుర్వినియోగం చేశారని మస్క్ ఆరోపించడం అగ్నికి ఆజ్యం పోసింది. ఇలా ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నడుస్తున్న సమయంలో వాళ్లిద్దరూ కలిసి ఉన్న పోటోలు సోషల్‌మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
బిలియనీర్లిద్దరూ బీచ్‌లో నడుస్తున్నట్టుగా, ఒకరిని ఒకరు కౌగిలించుకున్నట్లుగా, ఇద్దరూ కలిసి బీచ్‌లో పరుగులు తీస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా ట్విటర్ యూజర్ ఆ ఫొటోలను క్రియేట్ (Create) చేశాడు. ఈ ఫోటోలను ట్విటర్లో షేర్ చేసిన కొద్దిసేపటికే 70 లక్షల మంది వీక్షించారు. మరో లక్ష మందికి పైగా లైక్ చేశారు. ఈ ఫొటోలు వైరల్ (photos viral) కావడంతో ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇచ్చారు. ఇక ఈ ఫొటోలపై నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ‘వాస్తవానికి వాళ్లు మీమ్స్ కోసం ఇలా కలిసి ఫోటోషూట్ చేయాలి’ అని ఒకరు, ‘వావ్ కపుల్ గోల్స్’ అని మరొకరు కామెంట్స్ చేశారు. ‘మస్క్ ఈ రోజు మెటాను కొనుగోలు చేశారా ఏంటీ?’ అని నెటిజన్ స్పందించాడు. ‘బీచ్‌లో ఒకరినొకరు చూసుకొని, కౌగిలించుకుని, చిన్న పిల్లల్లా చెప్పులు లేకుండా పరిగెత్తుతున్నారు’ అని ఇంకో నెటిజన్ (Netizen) రియాక్ట్ అయ్యాడు.