»Btech Fee Is One Lakh Telangana Government Gives Rs 35000 Fee Reimbursement
BTech fee: లక్ష..ప్రభుత్వం ఇచ్చేది రూ.35 వేలు
తెలంగాణలో ఉన్నత విద్యపై బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. బీటెక్ కాలేజీలలో విద్యార్థుల ఫీజు(fees) లక్ష రూపాయలకుపైగా ఉంటే..ప్రభుత్వం కేవలం రూ.35 వేలు మాత్రమే చెల్లిస్తుంది. ఈ నేపథ్యంలో బీసీ, ఓసీ విద్యార్థులు ఆ ఫీజులు కట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణలోని బీటెక్(BTech) కాలేజీల్లో ప్రతి మూడేళ్లకు ఫీజులు(fees) పెరుగుతున్నాయి. అయితే ఉమ్మడి రాష్ట్రంలో 2008లో ప్రారంభమైన ఫీజు రీయింబర్స్ మెంట్(reimbursement) ప్రస్తుతం అమలు చేస్తున్నారు. కానీ అప్పుడు ఇచ్చిన ఫీజును కూడా ఇప్పటికీ ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెల్లించిన మాదిరిగా ఓసీ, బీసీలకు కూడా కేవలం రూ.35 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. అయితే అనేక కాలేజీలలో ఫీజు లక్ష రూపాయలకుపైగా ఉంటే ప్రభుత్వం మాత్రం 35 వేలు ఇచ్చి తప్పించుకుంటుంది.
తెలంగాణలోని 159 ఇంజినీరింగ్ కాలేజీల్లో గత ఏడాది ప్రభుత్వం ఫీజులను పెంచింది. ఆ నేపథ్యంలో కనీస ఫీజు(fee) రూ.45 వేలు ఉండగా, గరిష్ట ఫీజు రూ.1.60 వేలుగా ఉంది. రాష్ట్రంలో 45 వేల ఫీజు ఉన్న కాలేజీలు కేవలం 9 మాత్రమే ఉన్నాయి. మిగిలిన వాటిలో ఫీజు అధికంగా ఉండటంతో పేద విద్యార్థుల పేరెంట్స్ వాటిని కట్టలేక ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే మొత్తం పెంచాలని కోరుతున్నారు. కానీ ఇప్పటికీ పాత విధానమే అమలు చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రతి సంవత్సరం ఫీజుల చెల్లింపుల విషయంలో ఇబ్బందులు రాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు అనేక స్కూళ్లలో(schools) పుస్తకాలు, యూనిఫాం, రవాణా, లైబ్రరీ వంటి వాటితోపాటు కాషన్ డిపాజిట్గానూ తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నాయని అనేక మంది పేరెంట్స్ ఫిర్యాదులు చేస్తున్నారు. పాఠశాలలు తమను దోచుకోవడానికి కొత్త కారణాలు, వ్యూహాలను వెతుకుతున్నాయని వాపోతున్నారు. పాఠశాల నుంచి మాత్రమే పుస్తకాలు కొనుగోలు చేయాలని పాఠశాల తల్లిదండ్రులను బలవంతం చేస్తున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. విక్రయించిన పుస్తకాలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) లేదా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) సూచించినవి కావని చాలా మంది తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇవి తక్కువ ఖర్చుతో కూడుకున్నవని, కానీ ఎక్కువగా వసూలు చేస్తున్నారని అంటున్నారు.