»Stray Dogs Attack On Additional Collector In Siddipet
Dog Attack ఎంత ధైర్యం ఆ కుక్కకు.. అడిషనల్ కలెక్టర్ నే కరిచేసింది
అధికారిపైనే కుక్క దాడి చేసిందంటే ఇక ప్రజల పరిస్థితి ఏమిటో అని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇటీవల కుక్కల దాడి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కుక్క కాటు కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజుకు దాదాపు పది మందైనా వీటి బారిన పడుతున్నారు. వాటి నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా సంఘటనలు ఎక్కడో ఒక చోట చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ అదనపు కలెక్టర్ నే కుక్క కరిచింది. కుక్కల నియంత్రణపై చర్యలు తీసుకునే అధికారిపైనే అవి దాడికి పాల్పడ్డాయి. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
సిద్ధిపేట జిల్లా (Siddipet District) అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా (Additional Collector) శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. జిల్లా స్థాయి అధికారులకు సిద్దిపేట శివారులో అధికారుల నివాసాలు ఏర్పాటు చేశారు. అక్కడి అధికారిక నివాసంలో శ్రీనివాస్ రెడ్డి నివసిస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీన ఆయన తన క్వార్టర్స్ ఆవరణలో వాకింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో ఓ కుక్క అతడిపైకి దాడికి పాల్పడింది. ఆయన రెండు కాళ్లకు పిక్కల భాగంగా కొరికింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన సిద్దిపేటలో కలకలం రేపింది. కాగా అదే రోజు సిద్దిపేటలోనే ఆ బాలుడిని కూడా కుక్కలు గాయపర్చాయి. కాగా ఆ వీధి కుక్క అదనపు కలెక్టర్ పెంపుడు కుక్కను కూడా గాయపరిచింది.
అధికారిపైనే కుక్క దాడి చేసిందంటే ఇక ప్రజల పరిస్థితి ఏమిటో అని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో హైదరాబాద్ లో కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సంఘటన అనంతరం ప్రభుత్వం పెద్దగా మేల్కోలేదు. దీంతో తరచూ ఎక్కడో చోట కుక్క కాటు సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.