ఎండలు దంచుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా తెలంగాణలో (Telangana) కూడా ఉష్ణోగ్రతలు (Temparature) భారీగా పెరుగుతున్నాయి. చల్లదనం.. ప్రశాంత వాతావరణానికి పేరున్న హైదరాబాద్ (Hyderabad)లో కూడా ఎండ వేడిమి తీవ్రంగా ఉంది. మధ్యాహ్నం పూట రోడ్లు ఖాళీ అవుతున్నాయి. ఈ ఎండ వేడికి తాళలేక హైదరాబాద్ వాసులు చల్లగా బీర్లు (Beers) తాగేస్తున్నారు. కొంత ఉపశమనం పొందేందుకు బీర్లను ఆశ్రయిస్తున్నారు. ఇలా ఎంతలా తాగారంటే 17 రోజుల వ్యవధిలో ఏకంగా కోటి బీర్లు తాగేశారు.
ఎండలు తీవ్రమవుతుండడంతో హైదరాబాద్ లో బీర్ల విక్రయాలు (Sales) భారీగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ ఒకటి నుంచి 17వ తేదీ వరకు దాదాపు 1.02 కోట్ల సీసాల బీర్లు తాగారు. ఈ లెక్కలను ఆబ్కారీ శాఖ (Telangana Prohibition and Excise Department) తీసింది. హైదరాబాద్ తోపాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు కలిపి మొత్తం 8,46,175 కేసులు (ఒక్క కేసులో 12 బీర్లు) అమ్ముడుపోయాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి బీర్ల విక్రయాలు పెరిగాయి. పది శాతం చొప్పున అమ్మకాలు పెరిగాయి. ఇక అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. నెలకు సగటున లక్ష బీర్ కేసులు విక్రయాలు నమోదవుతున్నాయి.
ఎండల కారణంగా విస్కీ (Whisky), బ్రాందీ (Brandi) అలవాటు ఉన్న వారు కూడా బీర్ల వైపునకు మళ్లుతున్నారు. అందుకే విక్రయాలు అమాంతం పెరిగాయి. ఈ ఏప్రిల్ (April) నెలలోనే మూడు జిల్లాల పరిధిలో రోజుకు సగటున 6 లక్షల బీర్లు అమ్ముడుపోతున్నాయి. ఇంకా ఉష్ణోగ్రతలు భారీగా అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వేసవి తాపం పెరిగితే ప్రజలు దాహం తీర్చుకునేందుకు బీర్లను ఆశ్రయించే సంఖ్య పెరుగుతుంది. ప్రజల నుంచి భారీ డిమాండ్ వస్తుండడంతో బీర్ల కొరత రాకుండా తెలంగాణ ఆబ్కారీ శాఖ చర్యలు తీసుకుంటోంది.
నెల హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్
జనవరి 2,96,619 8,36907 1,34,468
ఫిబ్రవరి 3,31,784 9,34,452 1,46,763
మార్చి 3,68,569 10,77,240 1,63,358
ఏప్రిల్ 1,94,351 5,59,746 92,078
(17వ తేదీ వరకు)