»Bihar Vulgar Advertisement In Bhagalpur Railway Station
బూతుకు అడ్డాగా Railway Station.. మొన్న వీడియో.. నేడు సందేశాలు
దాదాపు మూడు నిమిషాల పాటు శృంగార వీడియో ప్రసారమైంది. ఇది మరువకముందే బిహార్ లోనే అలాంటి రెండో సంఘటన చోటుచేసుకుంది. రైల్వే శాఖ అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
రైల్వే స్టేషన్ (Railway Station) బూతుకు.. అశ్లీల కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నట్టు కనిపిస్తోంది. మొన్న బూతు వీడియో ప్రత్యక్ష ప్రసారం.. నేడు అసభ్య సందేశాలు వచ్చాయి. ‘వేశ్యలు (Call Girls) కావాలంటే ఈ నంబర్ సంప్రదించండి’ అంటూ ప్రకటనలు వచ్చాయి. ఇది చూసిన ప్రయాణికులు అవాక్కయ్యారు. వెంటనే వీడియోలు తీసి సోషల్ మీడియాలో (Social Media) పోస్టులు చేశారు. రైల్వే శాఖ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సంఘటన ఎక్కడ.. ఎలా జరిగిందో అనే వివరాలు తెలుసుకోండి.
బిహార్ (Bihar)లోని భగల్ పూర్ (Bhagalpur) రైల్వే స్టేషన్ లో సోమవారం రాత్రి 8.30 నుంచి డిస్ ప్లేస్ బోర్డులో ‘వేశ్య కావాలంటే ఈ నంబర్ లో సంప్రదించండి’ అంటూ ప్రకటన (Vulgar Advertisement) వచ్చింది. ఆ ప్రకటన బుధవారం తెల్లవారుజామున 4 గంటల వరకు కొనసాగింది. రైళ్ల వివరాల కోసం బోర్డు చూడగా ఈ ప్రకటన రావడం చూసి అవాక్కయ్యారు. మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రజలు గుమిగూడి చూడడంపై రైల్వే పోలీసులు చూసి వివరాలు తెలుసుకున్నారు. కాకపోతే కొన్ని గంటల తర్వాత పోలీసులు స్పందించారు. అనంతరం తెల్లవారుజామున ఆ బోర్డులోని ప్రకటనను తొలగించారు.
కాగా గత మార్చి 20వ తేదీన బిహార్ రాజధాని పాట్నా (Patna) రైల్వే స్టేషన్ లో కూడా ఇలాంటి సంఘటన జరిగిన విషయం తెలిసిందే. దాదాపు మూడు నిమిషాల పాటు శృంగార వీడియో ప్రసారమైంది. ఇది మరువకముందే బిహార్ లోనే అలాంటి రెండో సంఘటన చోటుచేసుకుంది. రైల్వే శాఖ అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా అసభ్య సందేశం ప్రసారం కావడంపై సబ్ డివిజనల్ అధికారి ధనంజయ్ కుమార్, డీఎస్పీ అజయ్ కుమార్ చౌదరి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా.. కొందరు సిబ్బంది ఇలాంటివి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.