»Khammam Traffic Si Son Mbbs Student Died With Heartstroke In Barbados Island
కరీబియన్ దీవిలో తెలంగాణ ఎస్సై కుమారుడు, MBBS విద్యార్థి గుండెపోటుతో మృతి
డాక్టర్ అయి తండాకు వస్తాడని అనుకుంటే మృతదేహంగా వస్తుండడంతో ఆ కుటుంబంతో పాటు తండావాసులు రోదిస్తున్నారు. ఎదిగిన పిల్లాడు ప్రయోజకుడై వస్తాడనుకుంటే ఇలా అయ్యిందేమిటని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కరేబియన్ (Caribbean) దీవుల్లో తెలంగాణకు (Telangana) చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి (MBBS Student) గుండెపోటుతో హఠాన్మరణం పొందాడు. నిండా 20 ఏళ్లు నిండాయో లేదో కానీ ఆ విద్యార్థి ఆకస్మిక మరణం చెందాడు. వైద్య విద్య చదివేందుకు వెళ్లిన కుమారుడు చనిపోయాడని తెలుసుకున్న కుటుంబసభ్యులు కుప్పకూలారు. డాక్టర్ గా వస్తాడని అనుకుంటే మృతదేహంగా వస్తుండడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఖమ్మం పట్టణం (Khammam) ట్రాఫిక్ ఎస్సై రవి కుమార్ పెద్ద కుమారుడు హేమంత్ శివరామకృష్ణ (20) (Hemanth Shiva Ramakrishna). కరేబియన్ దీవుల్లో ఒకటైన బార్బడోస్ (Barbados Island) లో శివరామకృష్ణ ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ప్రస్తుతం రెండో ఏడాది చదువుతున్న ఆ విద్యార్థి స్నేహితులతో కలిసి మంగళవారం సరదాగా సముద్ర తీరానికి (Beach) వెళ్లాడు. అక్కడి బీచ్ లో ఉత్సాహంగా గడిపాడు. ఈ సందర్భంగా మిత్రులతో కలిసి ఈత (Swimming) కొట్టాడు. ఆ కొద్దిసేపటికే శివరామకృష్ణ కుప్పకూలాడు. తోటి స్నేహితులు ఆందోళనకు గురై వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా విద్యార్థి మృతదేహన్ని స్వస్థలానికి తరలించేందుకు అక్కడి భారతీయులు (Indians) ఏర్పాట్లు చేస్తున్నారు.
విషాదం
ఖమ్మం ట్రాఫిక్ ఎస్సైగా పని చేస్తున్న రవి కుమార్ కుటుంబం ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలో నివసిస్తోంది. తమ పిల్లాడు మృతి చెందిన వార్త తెలియడంతో పెద్దతండా మొత్తం విషాదంలో మునిగింది. డాక్టర్ అయి తండాకు వస్తాడని అనుకుంటే మృతదేహంగా వస్తుండడంతో ఆ కుటుంబంతో పాటు తండావాసులు రోదిస్తున్నారు. ఎదిగిన పిల్లాడు ప్రయోజకుడై వస్తాడనుకుంటే ఇలా అయ్యిందేమిటని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రెండు రోజుల్లో మృతదేహం పెద్దతండాకు వచ్చే అవకాశం ఉంది.