»Human Dog Marriage Children Married Dogs In Ho Tribal In Balasore
Ho Tribal ఇదేం ఆచారం సామి.. పిల్లలకు కుక్కలతో వివాహం
విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు లేవు. వారు ఇంకా నాగరికతకు దూరంగా ఉన్నారు. తమ ప్రాంతానికి దుష్టశక్తులు రావొద్దనే నమ్మకంతో తమ పిల్లలకు కుక్కలతో పెళ్లి చేశారు.
ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతుంటే భారతదేశంలోని (India) ప్రజలు మాత్రం ఇంకా మూఢ విశ్వాసాలను (Superstition) పట్టుకుని వేలాడుతున్నారు. సంప్రదాయం, మతాచారం పేరిట ఇంకా ఆదిమ కాలం నాటి జీవితం గడుపుతున్నారు. పాలకులు వారికి అవగాహన కల్పించకపోవడం, విద్య అందుబాటులో ఉండకపోవడం వంటి వాటితో సాంఘిక దురాచారాలు పెరుగుతున్నాయి. తాజాగా ఇద్దరు పిల్లలకు వారి తల్లిదండ్రులు కుక్కలతో పెళ్లి జరిపించారు. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.
ఒడిశాలోని బాలసోర్ జిల్లాలో (Balasore District) హో తెగ జాతి ప్రజలు ఉన్నారు. సోరో బ్లాక్ బంద్ సాహి ప్రాంతంలో ఈ గిరిజన తెగవారు జీవిస్తున్నారు. వారికి విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు లేవు. వారు ఇంకా నాగరికతకు దూరంగా ఉన్నారు. తమ ప్రాంతానికి దుష్టశక్తులు రావొద్దనే నమ్మకంతో తమ పిల్లలకు కుక్కలతో పెళ్లి చేశారు. 11 ఏండ్ల తపన్ సింగ్ కు ఓ ఆడ కుక్కతో, ఏడేండ్ల వయసున్న బాలిక లక్ష్మికి ఒక మగ కుక్కతో వివాహం చేశారు. మంగళవారం ఈ వివాహ తంతు ముగించారు.
మైనర్ పిల్లలకు ఇలా కుక్కలతో పెళ్లి జరిపిస్తే దుష్టశక్తులు దూరమవుతాయని హో తెగ వారి నమ్మకం. తమ పిల్లల దవడలపై దంతాలు కనిపించడం అశుభంగా భావిస్తారు. కుక్కలతో అలా పెళ్లి చేస్తే దుష్టశక్తులు దూరమవుతాయని ఆ తెగకు చెందిన సాగర్ సింగ్ తెలిపారు. ఈ పెళ్లితో తమ జాతికి జరిగే చెడు కుక్కలకు జరుగుతుందని.. తమకు చెడు నుంచి విముక్తి లభిస్తుందని చెప్పారు. ఇవి కేవలం నమ్మకాలు మాత్రమే. ఈ మూఢ నమ్మకాలపై వారికి అవగాహన కల్పించేవారు లేరు. అధికారులు చర్యలు తీసుకుని హో తెగవారికి చదువు, వైద్యం సౌకర్యం కల్పించాలని మేధావులు, గిరిజన నాయకులు డిమాండ్ చేస్తున్నారు.