KRNL: ఎమ్మిగనూరు మున్సిపల్ వైస్ ఛైర్మన్ నజీర్ అహ్మద్‌పై కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని YCP BC సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు దొరబాబు మండిపడ్డారు. సోమవారం గోనెగండ్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. నజీర్ అహ్మద్ రాజకీయ పలుకుబడిని చూసి ఓర్వలేక, ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారంటూ గిట్టని వారు వదంతులు వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.