KMM: మధిర నియోజకవర్గం, ఎర్రుపాలెం మండలం,సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో అమ్మ ఫౌండేషన్ సౌజన్యంతో ఉచితంగా విద్యార్థినులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ఎదుగుదలే రాష్ట్ర ఎదుగుదల, వారి భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని పేర్కొన్నారు. విద్యాశాఖకు 13.5 శాతం నిధులు మంజూరు చేశామన్నారు.