»50 Tola Gold And Diamond Jewelery Stolen From House In Langerhouse Hyderabad
Hyderabad ఇఫ్తార్ పార్టీకి వెళ్లి వచ్చిన కుటుంబసభ్యులకు భారీ షాక్
కుటుంబసభ్యులంతా కలిసి వెళ్లారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయానికి ఇంటికి రాగా ఇల్లు తెరచి ఉంది. ఆందోళనకు గురై వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా చిందరవందరగా వస్తువులు పడి ఉన్నాయి.
పవిత్ర రంజాన్ (Ramadan) మాసంలో ఇఫ్తార్ పార్టీకి (Iftar Party) వెళ్లి వచ్చేలోపు ఇంట్లో దొంగతనం జరిగింది. ఉపవాసం (Fasting) ముగించి వచ్చిన కుటుంబసభ్యులకు షాక్ తగిలింది. తాళం తెరచి దొంగలు ఇంట్లో ఉన్న బంగారు (Gold), వజ్రాభరణాలు (Diamond Ornaments) దోచుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ (Hyderabad)లోని లంగర్ హౌస్ లో చోటుచేసుకుంది. లంగర్ హౌస్ ప్రాంతంలోని సాలార్ జంగ్ కాలనీలోకి చెందిన మాజిద్ తన కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం తన సోదరి ఇంటికి వెళ్లాడు. ఇఫ్తార్ విందు కోసం సాయంత్రం 5 గంటలకు కుటుంబసభ్యులంతా కలిసి వెళ్లారు. అనంతరం అర్ధరాత్రి 1.30 గంటల సమయానికి ఇంటికి రాగా ఇల్లు తెరచి ఉంది. ఆందోళనకు గురై వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా చిందరవందరగా వస్తువులు పడి ఉన్నాయి.
బీరువా (Locker) కూడా తెరచి ఉంది. ఇక బీరువాలోని 50 తులాల బంగారు ఆభరణాలు, రెండు వజ్రాల ఆభరణాలు కనిపించలేదు. ఆభరణాల ఖాళీ డబ్బాలు మాత్రమే కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఇంటిని పరిశీలించారు. బాల్కనీలోని (Balcony) తలుపుల గుండా ఇంట్లోకి దొంగలు ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు (Police) దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.