తెలంగాణ ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి (Yadadri Laxmi Narasimha Swamy Temple) ఆలయాన్ని కొత్త దంపతులు మంచు మనోజ్ (Manchu Manoj), భౌమ మౌనిక (Bhuma Mounika) సందర్శించారు. పెళ్లయిన అనంతరం ఆలయానికి రావాలని మొక్కుకున్నట్లు.. అందుకే వచ్చామని ఆ జంట తెలిపింది. కాగా, వారితో పాటు మనోజ్ సోదరి మంచు లక్ష్మీ ప్రసన్న (Manchu Lakshmi Prasanna,) కూడా వచ్చారు. అంతకుముందు మంచు లక్ష్మీ గొప్ప హృదయం చాటుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
యాదాద్రి జిల్లా కలెక్టర్ (Yadadri Bhuvanagiri District) కార్యాలయంలో మంగళవారం లక్ష్మీ, మనోజ్, భూమిక చేరుకున్నారు. కలెక్టర్ పమేలా సత్పత్తి, జిల్లా విద్యా శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ప్రైవేటు పాఠశాలలకు తగ్గట్టు స్మార్ట్ క్లాసెస్ ను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభిస్తామని మంచు లక్ష్మి తెలిపారు. 1 నుంచి 5వ తరగతుల వరకు మూడేళ్ల పాటు స్మార్ట్ క్లాసెస్ నిర్వహిస్తామని, వారితో పాటు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
అనంతరం యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించారు. సతీసమేతంగా హాజరైన మనోజ్ తో పాటు లక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించిన సీఎం కేసీఆర్ కు మనోజ్ ధన్యవాదాలు తెలిపారు. ఆలయం అందంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం మనోజ్ ‘వాట్ ది ఫిష్’ (What the fish), ‘మనం మనం బరంపురం’ సినిమాలతో మరో సినిమా కూడా చేస్తున్నాడు.