»Nara Lokesh Yuvagalam Padayatra Sucessfully Runing In Kurnool District
‘జగన్ ఇలా సెల్ఫీ దిగే దమ్ము నీకుందా?’ Nara Lokesh ఛాలెంజ్
విద్యుత్ చార్జీలు పెంచిన జగన్ కు బుద్ధి చెప్పాలంటే.. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ ను పీకి పారేయడమే పరిష్కారం. కుంటి సాకులతో జగన్ ప్రభుత్వం తొలగించిన ఫించన్లను టీడీపీ అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తాం.
సీఎం జగన్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ఆవేదన వ్యక్తం చేశారు. పేదలను పీడిస్తున్న సీఎం జగన్ ను ఓడిద్దామని.. ఫ్యాన్ ను పీకి పారేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. యువగళం (Yuvagalam Padayatra) పాదయాత్ర విజయవంతంగా కర్నూలు జిల్లాలో కొనసాగుతున్నది. ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని దేవనకొండలో 74వ రోజు యాత్రను మంగళవారం లోకేశ్ ప్రారంభించారు. అంతకుముందు వేరుశెనగ రైతులతో యువ నాయకుడు మాట్లాడాడు. వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ.. ‘విద్యుత్ చార్జీలు పెంచిన జగన్ కు బుద్ధి చెప్పాలంటే.. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ ను పీకి పారేయడమే పరిష్కారం. కుంటి సాకులతో జగన్ ప్రభుత్వం తొలగించిన ఫించన్లను టీడీపీ అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తాం. ధైర్యంగా ఉండాలి.. వచ్చేది చంద్రన్న ప్రభుత్వమే. అప్పుడు అంతా మంచే జరుగుతుంది’ మహిళా రైతులకు లోకేశ్ చెప్పారు.
ఇక సీఎం జగన్ కు లోకేశ్ సెల్ఫీ సవాళ్లు కొనసాగిస్తున్నారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ట్విటర్ వేదికగా లోకేశ్ సెల్ఫీ చాలెంజ్ విసురుతున్నారు. హంద్రీనీవా, పింఛన్ ల తొలగింపుపై తాజాగా లోకేశ్ సెల్ఫీ చాలెంజ్ జగన్ కు విసిరారు. టీడీపీ హయాంలో చేపట్టిన హంద్రీనీవా ప్రాజెక్టుతో వేసవిలోనూ జలకళ సంతరించుకుందని తెలిపారు. దేవనకొండ పట్టణానికి తాగునీరు సమస్య పరిష్కారమైందని చెప్పారు. ‘జగన్ ఇలా సెల్ఫీ దిగే దమ్ము నీకుందా? అని లోకేశ్ సవాల్ విసిరారు.
కాగా, ఆదోనిలో యువగళం పాదయాత్ర ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. దీనిపై తీవ్ర వివాదం ఏర్పడింది. దీనికి నిరసనగా టీడీపీ నాయకులు ఆదోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అధికార పార్టీ చెప్పినట్టు అధికారులు వింటున్నారని, అందుకే తమ పార్టీ ఫ్లెక్సీలు తొలగించారు అని టీడీపీ నాయకులు ఆరోపించారు. పార్టీ నాయకుల ఆందోళనతో మున్సిపల్ అధికారులు వెనక్కి తగ్గారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు.
ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ చెరువు ఒకప్పుడు ఎండిపోయి ఉండేది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక హంద్రీ నీవా జలాలతో చెరువును లింక్ చేశాము. దీని వల్ల దేవనకొండ పట్టణానికి తాగునీరు సహా పల్లెదొడ్డి, గెద్దరాళ్ల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి బోర్లకు పుష్కలంగా నీరు అందుతున్నాయి. pic.twitter.com/g3naDtILCw