»Hyderabad Tsrtc Special Buses To Uppal For Srh Vs Mi Match Says Md Vc Sajjanar
IPL అభిమానులకు శుభవార్త.. ఉప్పల్ స్టేడియానికి సులభంగా చేరుకోవచ్చు
పండుగలు, పర్వదినాలు, ప్రత్యేక రోజుల్లో తెలంగాణ ఆర్టీసీ ప్రజల కోసం ప్రత్యేకంగా బస్సు సేవలు అందిస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ కు కూడా ప్రత్యేక బస్సులు ఆర్టీసీ వేసింది.
ఐపీఎల్ సంబరంలో భాగంగా హైదరాబాద్(Hyderabad) గడ్డపై మూడో మ్యాచ్ మంగళవారం జరుగనుంది. ముంబై ఇండియన్స్ (Mumbai Indians- MI) తో మన సన్ రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) తలపడబోతున్నది. ఈ మ్యాచ్ కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు, క్రికెట్ అభిమానులు తరలిరానున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉప్పల్ (Rajiv Gandhi International Cricket Stadium -Uppal)లో జరిగే మ్యాచ్ కోసం అన్ని రవాణా సదుపాయాలు అందుబాటులో ఉండనున్నాయి. మెట్రోతో పాటు తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ప్రత్యేక సేవలు అందిస్తున్నాయి. ఐపీఎల్ అభిమానుల కోసం ఏకంగా 60 ప్రత్యేక బస్సులు (Special Buses) నడుపుతామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (VC Sajjamar) ప్రకటించారు.
పండుగలు, పర్వదినాలు, ప్రత్యేక రోజుల్లో తెలంగాణ ఆర్టీసీ ప్రజల కోసం ప్రత్యేకంగా బస్సు సేవలు అందిస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ కు కూడా ప్రత్యేక బస్సులు ఆర్టీసీ వేసింది. ‘క్రికెట్ అభిమానులారా!? ఐపీఎల్ మ్యాచ్ ని వీక్షించేందుకు ఈరోజు ఉప్పల్ (Uppal Stadium) క్రికెట్ స్టేడియానికి మీరు వెళ్తున్నారా!? మీ కోసమే హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఇవాళ జరిగే మ్యాచ్ కు ముందు, అనంతరం వాటిని తిప్పనుంది. ఈ బస్సుల ద్వారా క్షేమంగా సురక్షితంగా ఉప్పల్ స్టేడియానికి చేరుకోండి. సొంత, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ట్రాఫిక్, పార్కింగ్ ఇబ్బందులు పడకండి’ అని సజ్జనార్ ట్వీట్ చేశారు.
ఈ సీజన్ లో పాయింట్లు, విజయాలపరంగా సమానంగా ఉన్న ఇరు జట్లు మూడో విజయం (Win) కోసం ఆరాట పడనున్నాయి. గతేడాది పేలవ ప్రదర్శనతో అట్టడుగున నిలిచిన ఈ జట్లు పుంజుకోవాలని చూస్తున్నాయి. కాగా ఇప్పటికే మ్యాచ్ కోసం రోహిత్ (Rohith Sharma) సేన హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ‘మేం వచ్చేశాం.. పదండి ఉప్పల్ కు’ అని రోహిత్ శర్మ అభిమానులకు తెలుగులో పిలుపునిచ్చాడు. భువనేశ్వర్ (Bhuvneshwar Kumar) సారథ్యంలో హైదరాబాద్ మరో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది.