»Tsrtc Special Buses For Fish Distribution Should Light At Gandhi Bhavan Nampally
Special buses: చేప మందుకు స్పెషల్ బస్సులు..గాంధీ భవన్ వద్దనే దిగాలి
నాంపల్లి(nampally)లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్ 9న చేప ప్రసాదం పంపిణీ జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతోపాటు ఆర్టీసీ(tsrtc) ఈ కార్యక్రమానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు.
మృగశిర కార్తీకం సందర్భంగా బత్తిని కుటుంబం ఆస్తమా బాధితులకు చేపమందు అందజేస్తుంది. ఈసారి జూన్ 9 నుంచి చేపమందు పంపిణీ ప్రారంభం కానుండడంతో.. ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు పంపిణీ(fish distribution)కి ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షించారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు చేప ప్రసాద వితరణ ప్రారంభం కానుంది. చేప మందు కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి ఆస్తమా రోగులు రానున్నారు. ఈ క్రమంలో వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆర్ అండ్ బీ అధికారులు షెడ్లు, ఫ్లడ్ లైట్లు, క్యూలు ఏర్పాటు చేశారు.
దీంతోపాటు ఆర్టీసీ(tsrtc) అధికారులు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించారు. నేటి నుంచి(జూన్ 8) నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, కాచిగూడ రైల్వేస్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు వంటి ప్రాంతాల నుంచి దాదాపు 50 ప్రత్యేక బస్సులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకుంటాయని వెల్లడించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు మరో 14 ప్రాంతాల నుంచి 80 బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆస్తమా బాధితులు వారి సహాయకులతో నిండిపోయింది. ఇక్కడికి వచ్చే వారికి అనేక స్వచ్ఛంద సంస్థలు ఆహారం, నీరు అందిస్తున్నాయి. పోలీసులు(police) భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. M.J మార్కెట్ నుంచి బస్సులు/వ్యాన్లలో వచ్చే వారు గాంధీ భవన్ బస్ స్టాప్‌లో దిగాలి. నాంపల్లి నుంచి వచ్చే బస్సులు/వ్యాన్లు గృహ కల్ప బస్టాప్‌లో దిగి, చేప ప్రసాదం కోసం అజంతా గేట్/గేట్ నెం.2 ఎగ్జిబిషన్ గ్రౌండ్ వైపు కాలినడకన వెళ్లాలి. బస్సులు/వ్యాన్లు దిగి వారు తమ వాహనాలను గోషామహల్ పోలీస్ స్టేడియంలో పార్క్ చేయాలి.