Costliest Cities Ranking, Where Is Hyderabad Place
Costliest Cities Rank: ప్రపంచంలోని 227 నగరాల్లో షెల్టర్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్, ఇంటి వస్తువులు కొనుగోలు, వినోదం కోసం వ్యయం, డ్రెస్ తదితర 200 ఖర్చుల ఆధారంగా మెర్సర్స్ ( Mercers) 2023 సర్వే చేపట్టింది. ఇందులో భారత్‌లో గల ఏడు, ఎనిమిది నగరాలు చోటు దక్కించుకున్నాయి. టాప్ ప్లేస్‌లో ఎప్పటిలాగే హాంగ్‌కాంగ్, సింగపూర్ నిలిచారు. జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన రెండు నరగాలు ఎప్పటి మాదిరిగానే అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి.
ఫస్ట్ మూడు ఇవే..
హాంగ్ కాంగ్, సింగపూర్, జ్యూరిచ్.. తొలి మూడు స్థానాలో నిలిచాయి. మన దేశం విషయానికి వస్తే దేశ ఆర్థిక రాజధాని ముంబై (mumbai) 147వ స్థానంలో ఉంది. ఆ తర్వాత ఢిల్లీ (delhi) 169, చెన్నై (chennai) 184, బెంగళూర్ (bengalure) 189, హైదరాబాద్ (hyderabad) 202 స్థానంలో నిలిచింది. గతేడాది కన్నా 10 స్థానాలు దిగజారింది. కోల్ కతా 211, పుణె (pune) 213 ప్లేస్‌లో ఉన్నాయి. ఎంఎన్సీ కంపెనీలు ఏర్పాటు చేయాలంటే ముంబై (mumbai), ఢిల్లీ (delhi) అనుకూలం అని పేర్కొంది. జాబితాలో అట్టడుగు స్థానాల్లో పాకిస్థాన్‌కు (pakistan) చెందిన కరాచీ (karachi), ఇస్లామాబాద్ (islamabad) నిలిచాయి.
ట్రాన్స్పోర్ట్ ప్రయారిటీ
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రవాణా సౌకర్యం గల అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 400 చోట్ల పనిచేసే సామర్థ్యం ఉన్న ప్రాంతాల గురించి సర్వే చేశారు. గత ఏడాది మధ్యలో కరెన్సీ విలువ పడిపోవడంతో హవానా (havana) 83 స్థానాలు పడిపోయింది. దేశంలో ముంబై (mumbai) కన్నా చెన్నై (chennai), హైదరాబాద్ (hyderabad), కోల్ కతా, పుణెలో (pune) వసతి 50 శాతం తక్కువలో లభిస్తోందని పేర్కొంది. కోల్ కతాలో చాలా తక్కువలో ఉండొచ్చని వివరించింది.
దిగజారిన హైదరాబాద్ స్థానం
గత ఏడాది మెర్సర్స్ సర్వేలో హైదరాబాద్ (hyderabad) స్థానం 192గా ఉంది. ఈ సారి పది స్థానాలు కోల్పోయి 202కి చేరింది. ఒక సంవత్సరంలో హైదరాబాద్‌లో (hyderabad) అంతర్జాతీయ ప్రమాణస్థాయి విలువ పడిపోయింది. ఇంటర్నేషనల్ ప్యాసెంజర్స్/ టెకీ, వ్యాపారులు కోరుకున్న విధంగా భాగ్యనగరంలో వసతులు ఉండటం లేదట. ఐటీలో మేటీ, పెట్టుబడులు భారీగా వస్తున్నాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతోన్న.. సిటీలో అంతర్జాతీయ స్థాయి జీవన ప్రమాణాలు మాత్రం లేవని నిరూపణ అయ్యింది.