»Ipl 2023 Who Is Akash Madhwal Whats His Life Story Details
Mumbai హీరో ఆకాశ్ మధ్వాల్ కథేంటో తెలుసా..? ఈ స్థాయి కోసం ఎంత కష్టపడ్డాడో..
ఇంజనీరింగ్ చదివిన ఈ బౌలర్ మొదట టెన్నిస్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడేవాడు. కానీ భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆకాశ్ లోని ప్రతిభను గుర్తించాడు. ఇంజనీరింగ్ చదివిన ఈ బౌలర్ మొదట టెన్నిస్ బాల్ క్రికెట్ (Tennis Ball Cricket) మాత్రమే ఆడేవాడు. కానీ భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ (Waseem Jaffer) ఆకాశ్ లోని ప్రతిభను గుర్తించాడు.
గతేడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు ఈసారి ఏకంగా ఫ్లే ఆఫ్స్ దాటుకుని ఫైనల్ చేరుకునేందుకు సిద్ధమైంది. జట్టుకు అంతటి విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన బౌలర్ ఆకాశ్ మధ్వాల్ (Akash Madhwal). రెండో క్వాలిఫయిర్ (Qualifier) మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ను తన బంతితో ఆకాశ్ ఇంటిబాట పట్టించాడు. కేవలం ఐదంటే ఐదు పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టిన ఆకాశ్ హీరో అయ్యాడు. ఇప్పుడు అందరూ ఆకాశ్ ఎవరు.. అతడి కథ ఏంటి? అని ఆరా తీస్తున్నారు. ఆకాశ్ మధ్వాల్ నేపథ్యం తెలుసుకోండి.
ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని రూర్కీకి చెందిన ఆకాశ్ మధ్వాల్ 23 నవంబర్ 1993న జన్మించాడు. ఇంజనీరింగ్ చదివిన ఈ బౌలర్ మొదట టెన్నిస్ బాల్ క్రికెట్ (Tennis Ball Cricket) మాత్రమే ఆడేవాడు. కానీ భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ (Waseem Jaffer) ఆకాశ్ లోని ప్రతిభను గుర్తించాడు. 2019లో ఉత్తరాఖండ్ తరఫున ఆడుతున్న సమయంలో మధ్వాల్ లోని ప్రతిభను గుర్తించి జట్టులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆకాశ్ అనంతరం 2022-23 దేశవాళీ సీజన్ లో జట్టుకు కెప్టెన్ గా కూడా ఎంపికయ్యాడు. అవతార్ సింగ్ (Avatar Singh) అనే కోచ్ వద్ద మధ్వాల్ శిక్షణ తీసుకున్నాడు. రిషబ్ పంత్ (Rishab Pant) ఇంటి పక్కనే నివసిస్తుంటాడు. పంత్, ఆకాశ్ ఇద్దరు అవతార్ సింగ్ వద్ద శిక్షణ పొందారు.
ఐపీఎల్ అవకాశం..
2019-20 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో (Mustak Ali Trophy) ఉత్తరాఖండ్ జట్టు తరఫున ఆడి సత్తా చాటాడు. 2021లోనే ఐపీఎల్ (IPL)లో ప్రవేశించాడు. కానీ మైదానంలోకి ప్రవేశం లభించలేదు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వేలంలో కొనుగోలు చేసినప్పటికీ ఆడే అవకాశం రాలేదు. 2022లో అన్ సోల్డ్ గా ఉండగా.. ఆ సీజన్ లోనే సూర్య కుమార్ యాదవ్ కు రీప్లేస్ మెంట్ గా ముంబై ఇండియన్స్ జట్టులో ఆకాశ్ చేరాడు. అప్పుడు ఆకాశ్ కు బౌలింగ్ వేసే అవకాశం దక్కలేదు. 16వ ఐపీఎల్ సీజన్ కు వేలంలో రూ.20 లక్షలకు ఆకాశ్ ను ముంబై కొనుగోలు చేసింది.
దుమ్ము రేపిన ఆకాశ్
ఈ సీజన్ లో తనను తీసుకున్న ముంబైకి న్యాయం చేశాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్ లు ఆడిన ఆకాశ్ ఏకంగా 13 వికెట్లు పడగొట్టాడు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)తో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఆకాశ్ మెరిశాడు. ఆ మ్యాచ్ లో నాలుగు వికెట్లు పడగొట్టి జట్టును ప్లేఆఫ్స్ (Play Offs)కు ఎంట్రీ ఇచ్చేలా చేశాడు. ఈ సీజన్ లో ముంబైకి కుర్రాళ్లు అండగా నిలుస్తున్నారు. రింకూ సింగ్ మెరుగైన ప్రదర్శన చేయగా.. ఇప్పుడు ఆకాశ్ తోడుగా నిలిచాడు. ఇక ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ (Gujarat)ను ఢీకొని ఫైనల్ చేరాలని ముంబై (Mumbai) తహతహలాడుతోంది. మరి ఆ మ్యాచ్ లో ఆకాశ్ మధ్వాల్ ప్రదర్శన ఎలా ఉంటుందోనని ముంబై అభిమానులే కాదు ఐపీఎల్ ప్రియులు కూడా ఎదురుచూస్తున్నారు.