»Bcci Takes Initiative To Plant 500 Trees For Every Dot Ball In Ipl 2023 Playoffs
BCCI Dot Ballకు 500 మొక్కలు.. ఐపీఎల్ తో సరికొత్త ఆలోచనకు శ్రీకారం
రెండో క్వాలిఫయర్, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ ల్లో కూడా ఇలాగే డాట్ బాల్స్ కు మొక్కలు నాటుతామని బీసీసీఐ తెలిపింది. మొత్తం మూడు మ్యాచ్ లను కలిపితే దాదాపు 250 డాట్ బాల్స్ నమోదయ్యే అవకాశం ఉంది. ఇవి లెక్కేస్తే దాదాపు మూడు లక్షలకు పైగా మొక్కలు నాటనున్నారు.
నిన్న గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మ్యాచ్ ప్రేక్షకులకు మాంచి మజానిచ్చింది. ముఖ్యంగా సీఎస్కే(CSK) చేజింగ్ క్రికెట్ ప్రియులను కట్టి పడేసింది. అయితే ఈ మ్యాచ్ (Match)లో ఒక ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. మ్యాచ్ స్కోర్ బోర్డులో (Score Board) డాట్ బాల్స్ ( స్థానంలో మొక్కలు కనిపించాయి. అది చూసిన ప్రేక్షకులు మొదట ఏమిటో అర్థం కాలేదు. సున్నాకు బదులు చెట్టు కనిపించడం వెనుక మంచి ప్రయోజనం దాగి ఉందని తర్వాత తెలిసింది. ఎన్ని డాట్ బాల్స్ (Dot Balls) వేశారో అన్ని వేల మొక్కలు నాటాలని బీసీసీఐ నిర్ణయించింది. బీసీసీఐ (BCCI) నిర్ణయానికి తొలిసారి సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఐపీఎల్ 16వ సీజన్ లో ప్లే ఆఫ్స్ మ్యాచ్ (Playoff Match)ల సందర్భంగా బీసీసీఐ, ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్ టాటా కంపెనీ (TATA Companies) సరికొత్త ఆలోచనకు బీజం వేసింది. గ్రీన్ క్యాంపెయిన్ (Green Campaign) పేరిట అద్భుతమైన ఆలోచన చేసింది. ప్లేఆఫ్స్ మ్యాచ్ ల్లో ప్రతి డాట్ బాల్ కు 500 మొక్కలు (Trees) నాటాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో డాట్ బాల్ వేసిన ప్రతిసారి స్కోర్ బోర్డులో మొక్క కనిపించింది. డాట్ బాల్ వేసిన సమయంలో సున్నాకు బదులు పచ్చని మొక్క కనిపించింది. ఇలా తొలి క్వాలిఫయర్ (Qualifier) లో మొత్తం 84 డాట్ బాల్స్ వచ్చాయి. జీటీ ఇన్నింగ్స్ (Innings)లో 50, చెన్నై ఇన్నింగ్స్ లో 34 డాట్ బాల్స్ నమోదయ్యాయి.
ప్రతీ డాట్ బాల్ కు 500 మొక్కలు చొప్పున 84 డాట్ బాల్స్ కు మొత్తం 42 వేల మొక్కలు నాటనున్నారు. కాగా రెండో క్వాలిఫయర్, ఎలిమినేటర్, ఫైనల్ (Final) మ్యాచ్ ల్లో కూడా ఇలాగే డాట్ బాల్స్ కు మొక్కలు నాటుతామని బీసీసీఐ (Board of Control for Cricket in India) తెలిపింది. మొత్తం మూడు మ్యాచ్ లను కలిపితే దాదాపు 250 డాట్ బాల్స్ (Balls) నమోదయ్యే అవకాశం ఉంది. ఇవి లెక్కేస్తే దాదాపు మూడు లక్షలకు పైగా మొక్కలు నాటనున్నారు.
ఈ విషయాన్ని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా తెలిపాడు. ‘ఐపీఎల్ (IPL) ప్లేఆఫ్స్ లో ప్రతి డాట్ బాల్ కు 500 మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్న టాటా కంపెనీతో భాగస్వామి కావడం గర్వంగా ఉంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో 84 డాట్ బాల్స్ కు 42 వేల మొక్కలు నాటనున్నాం. టీ20 బ్యాటర్ల ఆట అని ఎవరూ చెప్పారు? మొత్తం బౌలర్ల చేతుల్లోనే ఉంది’ అని జై షా ట్వీట్ చేశాడు.