»Ipl 2023 Gt Vs Mi Match Who Will Win Todays Ipl Who Goes To Final
MI vs GT ఫైనల్ చేరేదెవరు? చెన్నైని ఢీకొట్టేదెవరు? ఉత్కంఠగా నేటి మ్యాచ్
చెన్నై మ్యాచ్ మాత్రం ఒక పాఠంగా నిలిచింది. బౌలింగ్ లో మరింత రాణించాల్సి ఉంది. ప్రత్యర్థి ఐదు సార్లు విజేత అని గుర్తుంచుకుని జాగ్రత్తగా ఆడాలి. గత తప్పిదాలను చూసుకుని వాటిని సవరించుకుని ఆడితే విజయం టైటాన్స్ దే.
ఒకరు ఐదుసార్లు విజేత.. మరొకరు డిఫెండింగ్ చాంపియన్. వీరిద్దరి మధ్య సాగే పోరాటం మామూలుగా ఉండదు. ఫ్లేఆఫ్స్ (Playoffs) సమరంలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)మధ్య కీలక మ్యాచ్ నేడు జరుగనుంది. తొలి క్వాలిఫయర్ లో చెన్నై చేతిలో పరాభవం మూటగట్టుకున్న గుజరాత్.. ఎలిమినేటర్ లో లక్నోపై అద్భుత విజయంతో రెండో క్వాలిఫయర్ కు దూసుకొచ్చిన ముంబై మధ్య అత్యంత ఉత్కంఠతో మ్యాచ్ ఉండనుంది. ఈ కీలక సమరానికి అహ్మదాబాద్ (Ahmedabad) స్టేడియం వేదిక కానుంది. మరి గెలిచి ఫైనల్ చేరేదెవరో తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చెన్నైతో తలపడేది ఎవరో కొన్ని గంటల్లో తెలియనుంది. ఈ క్రమంలోనే జట్టు బలాబలాలు తెలుసుకుందాం పదండి.
ఈ సీజన్ లో ముంబై రెండు ఓటములతో ప్రారంభించింది. అనంతరం గొప్ప పోరాటంతో ఈ దశకు చేరుకుంది. ఆరంభంలో తడబడినా అనంతరం గొప్పగా పుంజుకుని జట్టు సమష్టిగా రాణిస్తుండడంతో ముంబై ఇండియన్స్ ఫైనల్ కు అడుగు దూరంలో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ (Hyderabad), లక్నో మ్యాచ్ ల్లో ముంబై ఆట ఒక రేంజులో ఉంది. ఈ మ్యాచ్ ల్లో జట్టు కలిసికట్టుగా ఆడి కీలక విజయాలను సొంతం చేసుకుంది. జట్టుకు ప్రధాన బలంగా బ్యాటింగ్ (Batting)లో కామెరూన్ గ్రీన్ (Cameron Green).. బౌలింగ్ (Bowling)లో పేసర్ ఆకాశ్ మధ్వాల్ (Akash Madhwal) ఉన్నారు. వీరిద్దరి ప్రదర్శనతో ముంబై మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ఇక గుజరాత్ మ్యాచ్ లో వీరిద్దరూ రెచ్చిపోతే మాత్రం ఫైనల్ కు వెళ్లడం ఖాయమే. సూర్య కుమార్ (Surya kumar) జోరు కొనసాగిస్తే.. వీరికి హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ (Tilak Verma), రోహిత్ (Rohith Sharma), ఇషాన్, టిమ్ డేవిడ్ బ్యాట్ తో అదరగొడితే పరుగుల వరద ఖాయమే. ఒక్కసారి వీరు రెచ్చిపోతే గుజరాత్ బౌలింగ్ దళం కట్టడి చేయడం చాలా కష్టమే. బౌలింగ్ లో కూడా ముంబై బలంగా ఉంది. ఆకాశ్ మధ్వాల్ కు తోడు వెటరన్ స్పిన్నర్ పీయూశ్ చావ్లా (Piyush Chavla), బెరెన్ డార్ఫ్ (Beren Dorff) దీటైన బౌలింగ్ వేస్తే ఇక చెన్నైతో సమరానికి ముంబై సిద్ధం కావాల్సిందే. కొన్ని లోపాలను సవరించుకుంటే ముంబైని ఆపతరం కాదు.
గుజరాత్ లో కలవరం
తొలి క్వాలిఫయర్ లో చెన్నై (Chennai) చేతిలో ఘోర పరాభవం నుంచి గుజరాత్ టైటాన్స్ మేలుకోవాలి. ఆ మ్యాచ్ లో జరిగిన తప్పిదాలను నివృత్తి చేసుకుని బరిలోకి దిగాలి. రెండోసారి ట్రోఫీని (Trophy) చేజిక్కించుకోవాలంటే లీగ్ దశలో చేసిన ప్రదర్శనను పునరావృతం చేయాలి. చెన్నై మ్యాచ్ లో అన్ని విభాగాల్లో టైటాన్స్ విఫలమైంది. బ్యాటింగ్ లో ప్రధానంగా శుభ్ మన్ గిల్ (Shubman Gill)పై ఆధారపడడం జట్టుకు ప్రధాన లోపం. విజయ్ శంకర్ (Vijay Shankar) కొంత తోడు నిలుస్తున్నా కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya), మిల్లర్ (Millar), సాహా, తెవాతియా బ్యాట్ ఝులిపించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ లో కొంత బలంగా ఉన్నా చెన్నై మ్యాచ్ మాత్రం ఒక పాఠంగా నిలిచింది. బౌలింగ్ లో మరింత రాణించాల్సి ఉంది. ప్రత్యర్థి ఐదు సార్లు విజేత అని గుర్తుంచుకుని జాగ్రత్తగా ఆడాలి. గత తప్పిదాలను చూసుకుని వాటిని సవరించుకుని ఆడితే విజయం టైటాన్స్ దే.
పిచ్ ఎలా ఉందంటే..
అహ్మదాబాద్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో భారీ స్కోర్లు (Score) నమోదయ్యే అవకాశం ఉంది. బ్యాటింగ్ కు అనుకూలంగా పిచ్ (Pitch) ఉంది. మంచి పేస్ (Pace), బౌన్స్ (Bowns)కు అనుకూలంగా పిచ్ తయారుచేసినట్లు సమాచారం. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. వర్షం ప్రభావం ఏమీ లేదు.
తుది జట్లు (అంచనా)
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, షోకీన్/ నేహాల్, జోర్డాన్, చావ్లా, బెరెన్ డార్ఫ్, ఆకాశ్ మధ్వాల్. గుజరాత్ టైటాన్స్:
శుభ్ మన్ గిల్, సాహా, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, మిల్లర్, సుదర్శన్/ అభినవ్ మనోహర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, షమి.