NRML: విగ్రహాలు ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం సారంగాపూర్ మండల కురుమ సంఘం నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాయకులు మల్లేష్ తదితరులు మాట్లాడుతూ.. లోకేశ్వరం మండలం రాయపూర్ కాండ్లీలో బీరప్ప ఆలయాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారని, పోలీసులు వారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.