AP: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత, ఎంపీ మిథున్ రెడ్డి(A4)ని సిట్ అధికారులు రెండో రోజు కస్టడీకి తీసుకున్నారు. రాజమండ్రి జైలు నుంచి విజయవాడకు తరలించారు. సాయంత్రం వరకు విచారించి కోర్టులో హాజరుపరిచి అనంతరం జైలుకు తరలించనున్నారు. నిన్న మిథున్ రెడ్డిని 4 గంటలపాటు విచారించారు. PLR ప్రాజెక్ట్స్ ఖాతాల్లోకి మద్యం ముడుపుల సొమ్ము రూ.5 కోట్లు జమకావడంపై ప్రశ్నించినట్లు సమాచారం.