ప్రకాశం: టంగుటూరు గ్రామపంచాయతీ బాపూజీ కాలనీలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉంటే గ్రామస్థులు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అనంతరం మొక్కలు నాటారు. ఆయనతో పాటు కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు RDO లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు.