AP: సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా మాచర్లకు చేరుకున్నారు. ఆయనకు మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, జూలకంటి, యరపతినేని తదితరులు స్వాగతం పలికారు. యాదవ బజారు రోడ్డులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం కానున్నారు. అనంతరం స్వచ్ఛరథం వాహనాలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ప్రజావేదిక బహిరంగ సభలో మాట్లాడనున్నారు.