Kannappa: ఇక ప్రభాస్ వంతు.. ‘కన్నప్ప’కు మూడు రోజులే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే ఎవ్వరికైనా షాక్ అవాల్సిందే. భారీ పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు డార్లింగ్. అయినా కూడా మధ్యలో కన్నప్ప కోసం కీలక పాత్రలో కనిపించడానికి రెడీ అవుతున్నాడు. కానీ మూడు రోజులు మాత్రమే అంటున్నారు.
Kannappa: మిగతా స్టార్ హీరోలంతా ఒకటి, రెండు సినిమాలోనే సరిపెట్టుకుంటుంటే.. ప్రభాస్ మాత్రం ఏకంగా అరడజను వరకు సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం కల్కి సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. జూన్ 27న కల్కి 2898ఏడి గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే.. కల్కి 2 కూడా ఉంటుందనే టాక్ ఉంది. కల్కి రిలీజ్ అయితే గానీ.. ఈ విషయంలో క్లారిటీ రాదు. ఇక మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. దీంతో పాటు.. మే మంత్ ఎండింగ్లో సలార్2 సెట్స్ పైకి వెళ్లనుంది. అక్టోబర్ వరకు సలార్ 2 షూటింగ్ పూర్తి చేసి.. వెంటనే సందీప్ రెడ్డి స్పిరిట్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఆ తర్వాత హనురాఘవపూడితో వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్లో లవ్ స్టోరీ చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఇంత బిజీగా ఉన్న కూడా.. మంచు విష్ణు కోసం కన్నప్ప సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు ప్రభాస్. ముందుగా ఈ మూవీలో ప్రభాస్ శివుడిగా కనిపిస్తాడని అన్నారు. కానీ ప్రభాస్ వద్దని చెప్పడంతో.. అక్షయ్ కుమార్‌ను శివుడిగా తీసుకున్నారు. దీంతో.. ప్రభాస్ నందీశ్వరుడి పాత్రలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. రీసెంట్‌గానే అక్షయ్‌కు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేయగా.. ఇప్పుడు ప్రబాస్ పోర్షన్ కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. కన్నప్ప మూవీ కోసం కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఇచ్చాడట డార్లింగ్. దీంతో శరవేగంగా షూటింగ్ పూర్తి చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారట. ఇప్పటికే ఓ సెట్ కూడా వేసినట్లు సమాచారం. మే రెండో వారంలో ప్రభాస్ షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. ఏదేమైనా.. కన్నప్పలో ప్రభాస్ అనేది మాత్రం సినిమాకు పాన్ ఇండియా సౌండ్ ఓ రేంజ్లో పెంచేలా ఉందనే చెప్పాలి.