»Congress Party Senior Leader V Hanumantha Rao Demands For Bc Caste Census
సీఎం KCR, మంత్రి KTRకు మాజీ ఎంపీ వి హనుమంత రావు లేఖ
పార్టీ శ్రేణులు ఈ అంశాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలి. పార్టీ పదవుల్లో కూడా బీసీల ప్రాధాన్యం పెరగాల్సిన అవసరం ఉంది. బీసీలను దగ్గర చేర్చుకుంటేనే పార్టీ అధికారంలోకి వస్తుంది.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం వినిపిస్తున్న మాట బీసీ జన గణన (BC Census) . అంటే దేశంలో ఎంత మంది బీసీ జనాభా ఉందో లెక్కించాలని డిమాండ్ వస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రధానంగా ఇదే డిమాండ్ పై పోరాడుతోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇదే ప్రస్తావన తీసుకొచ్చారు. జాతీయ స్థాయిలో దీనిపై పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదే విషయంపై వీ హనుమంత రావు (V Hanumantha Rao) డిమాండ్ చేశారు. బీసీ జనగణన చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (Modi) వీహెచ్ కోరారు.
హైదరాబాద్ (Hyderabad)లోని పార్టీ కార్యాలయం గాంధీ భవన్ (Gandhi Bhavan)లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వీహెచ్ (VH) మాట్లాడారు. ‘బీసీలకు ఐఐటీ, ఐఐఎంలలో రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. వెంటనే బీసీల జనగణన చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు క్రిమిలేయర్ ఎత్తివేయాలని కోరారు. ‘ఈ విషయంపై ప్రధాని మోదీని ఎన్నిసార్లు కోరినా స్పందన లేదు. బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచన గాంధీ కుటుంబంలో ఉంది. రిజర్వేషన్లు పెంచాలనే ఆలోచన రాహుల్ గాంధీకి ఉంది. రాహుల్ ఆలోచనను స్వాగతిస్తున్నాం. పార్టీ శ్రేణులు ఈ అంశాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలి. పార్టీ పదవుల్లో కూడా బీసీల ప్రాధాన్యం పెరగాల్సిన అవసరం ఉంది. బీసీలను దగ్గర చేర్చుకుంటేనే పార్టీ అధికారంలోకి వస్తుంది’ అని తెలిపారు.
ఇక సీఎం కేసీఆర్ (K Chandrashekar Rao), మంత్రి కేటీఆర్ (KT Rama Rao), ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీలకు లేఖ రాసినట్లు వీహెచ్ చెప్పారు. హైకోర్టుకు వెళ్లే దారిలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ వారి ముగ్గురికి లేఖ రాసినట్లు తెలిపారు. పాతబస్తీలో అంబేడ్కర్ విగ్రహం పెట్టాలని డిమాండ్ చేశారు.