VHను వదలని సైబర్ కేటుగాళ్లు.. హరిరామ జోగయ్య పేరు చెప్పి డబ్బులు డిమాండ్
సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్‌ను సైబర్ కేటుగాళ్లు బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. హరిరామ జోగయ్య మాట్లాడుతున్నానని చెప్పి.. మందుల కోసం రూ.3 వేలు పంపించమని అడిగారని వీహెచ్ తెలిపారు.
Cyber Cheaters: సైబర్ నేరగాళ్ల (Cyber Cheaters) బారిన కామన్ పీపులే కాదు.. సెలబ్రిటీలు, పొలిటిషీయన్స్ కూడా పడుతున్నారు. ఇటీవల జానారెడ్డి, సుజనా చౌదరి పేరు చెప్పి కాల్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ నేత వీ హనుమంత రావు (VH) కూడా సైబర్ కేటుగాళ్ల బారిన పడ్డారు. వీహెచ్‌కు హరిరామ జోగయ్య పేరుతో కాల్ చేశారు. స్నేహితుడు, మాజీ సహచర మంత్రి కావడంతో మాట్లాడారు. బాగున్నావా అని అడిగితే బాగున్నాను అంటూనే.. మందులకు డబ్బులు అడిగాడని వీహెచ్ తెలిపారు. మందుల కోసం రూ.3 వేలు పంపాలని మరో నంబర్ ఇచ్చాడట. ఇక రాత్రి 7.30 నుంచి ఒక్కటే ఫోన్లు వచ్చాయని చెప్పారు. రాత్రి 10.30కు కూడా కాల్ వచ్చిందని వివరించారు. తర్వాత మొబైల్ స్విచాఫ్ చేశానని తెలిపారు.
ఆ రోజే ఎంపీ హర్షకుమార్కు (Harsha Kumar) ఫోన్ చేసి విషయం చెప్పానని మీడియాకు వివరించారు వీహెచ్. హరిరామ జోగయ్య ఫోన్ చేశాడని.. మందుల కోసం డబ్బులు పంపించామని చెప్పాడని తెలిపారు. ఆయన సినిమాలు తీశాడు, మంత్రి పదవీ చేపట్టాడు.. కాలేజీలు ఉన్నాయని హర్షకుమార్ తనతో అన్నాడని వీహెచ్ చెబుతున్నారు. అయినా.. ఎవరి పరిస్థితి ఏంటోనని.. డబ్బులు పంపించామని చెప్పానని అన్నారు. మరునాడు ఓ మనిషి ద్వారా హర్షకుమార్ రూ.5 వేలు హరిరామ జోగయ్యకు పంపించానని చెప్పారు. ఆ డబ్బులు చూసి ఆయన షాక్ అయ్యాడట. తాను వీహెచ్‌ను డబ్బులు అడగలేదని.. ఎవరో మోసం చేశారని ఆయన స్పష్టంచేశారు.
విషయం తెలిసిన వెంటనే వీహెచ్ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్‌కు ఫోన్ చేసి కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత విచారిస్తే ఖమ్మం నుంచి కాల్ వచ్చిందని తెలిసింది. ఇలా.. సీనియర్ నేత వీహెచ్‌ను కూడా సైబర్ కేటుగాళ్లు వదల్లేదు. అమౌంట్ పంపించమని అడిగారు. ఆయన నేరుగా మరో వ్యక్తితో నగదు పంపడంతో వలలో పడలేదు. ఆన్ లైన్లో పంపితే.. ఇక అంతే సంగతులు.