»Sonia Gandhi Birthday Celebrations At Gandhi Bhavan
Sonia Gandhi బర్త్ డే వేడుకలు..కేక్ కట్ చేసిన వీహెచ్
కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. సీనియర్ నేత వి హనుమంతరావు కేక్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డికి తినిపించారు.
Sonia Gandhi Birthday Celebrations At Gandhi Bhavan
Sonia Gandhi Birthday Celebrations: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) జన్మదిన వేడుకలను గాంధీభవన్‌లో నిర్వహించారు. భారీ కేక్‌ను సీనియర్ నేత వి హనుమంతరావు కట్ చేశారు. బర్త్ డే వేడుకల్లో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో జోష్ నెలకొంది. ఇటీవల సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. మంత్రులకు శాఖలను కూడా కేటాయించారు. సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. ముందుగా వీహెచ్ కట్ చేసి.. రేవంత్ రెడ్డికి తినిపించారు. తర్వాత ఠాక్రేకు వెంకట్ రెడ్డి తినిపించారు.
సోనియా గాంధీ (Sonia Gandhi) 78 వ జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసే హక్కు, అర్హత వీహెచ్ కే ఉందన్నారు. తమకు ఈ పదవులు దక్కడం వెనక కార్యకర్తల కృషి, త్యాగం ఉన్నాయని తెలిపారు. సోనియా గాంధీ బర్త్ డే రోజు అయిన డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పండగ అని రేవంత్ చెప్పారు. 2009 డిసెంబర్ 9వ తేదీన అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియ ప్రారంభించిందని గుర్తుచేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రాజకీయ ఒడిడుకులు ఎదుర్కొని రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. డిసెంబర్ 7వ తేదీన ఎల్బీ స్టేడియానికి సోనియా గాంధీ వచ్చిన సమయంలో తెలంగాణ తల్లిని చూశారని.. లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు తాను ఉన్నానని భరోసా ఇచ్చారని వివరించారు.
Sonia Gandhi Birthday Celebrations By CM Revanth Reddy and Telangana Congress Leaders.
సోనియా గాంధీ జన్మదిన వేడుకలను సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్వహించారు
👉 సోనియా గాంధీ 78 వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు 👉 సోనియా గాంధీ కేక్ కట్ చేసే హక్కు, అర్హత విహెచ్… pic.twitter.com/cCUeVnQs6S
2017 డిసెంబర్ 9వ తేదీన ఫస్ట్ టైమ్ గాంధీభవన్‌లో అడుగు పెట్టానని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రిగా గాంధీభవన్ వచ్చానని పేర్కొన్నారు. 10 ఏళ్లలో కార్యకర్తలపై వేల కేసులు నమోదయ్యాయని, అక్రమ కేసులను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. ఇందిరమ్మ ఆశయాలను తెలంగాణ రాష్ట్రంలో నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.