Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. మంత్రులకు శాఖలు కేటాయించారు. దీనికోసం ఢిల్లీ వెళ్లి.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారు. హోం శాఖ, పురపాలక, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు సీఎం రేవంత్ వద్ద ఉన్నాయి. తెలంగాణలో సీఎం రేవంత్ సహా 18 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసుకునే వీలుంది. ఇప్పుడు 11 మందితో మంత్రివర్గం ఏర్పడింది. మరో ఏడుగురికి మంత్రులుగా ఛాన్స్ ఉంది. సామాజిక సమీకరణాల ఆధారంగా మిగిలిన బెర్త్ కన్ఫామ్ చేసే అవకాశం ఉంది.
దుద్దిళ్ల శ్రీధర్‌బాబు – ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహరాలు
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి – రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ
జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్, పర్యాటకం
ఉత్తమ్ కుమార్ రెడ్డి – నీటి పారుదల శాఖ, పౌరసరఫరాలు