»Telangana Home Minister Mahmood Ali Who Slaps The Home Guard Chick
Home guard:ను కొట్టిన హోంమంత్రి అలీ..నెటిజన్ల ఆగ్రహం
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉన్నత పదవిలో ఉండి సెక్యూరిటీ సిబ్బందిపై చేయి చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కేవలం బోకే ఇవ్వనందుకే అలా చేస్తారా అంటూ అనేక మంది కామెంట్లు చేస్తున్నారు.
telangana Home Minister Mahmood Ali who slaps the home guard chick
తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ(Mahmood Ali) ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా పుష్పగుచ్ఛాన్ని ఇవ్వడంలో విఫలమైనందుకు మహమూద్ అలీ తన గన్‌మెన్‌ని చెంపదెబ్బ కొట్టడం ప్రస్తుతం వివాదానికి దారి తీసింది. మంత్రి శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav)కు హోంమంత్రి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలనుకున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే పుష్ప గుచ్చం లేకపోవడంతో అతను నిరాశకు లోనయ్యారు. ఆ క్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ అతని భద్రతా సిబ్బందిపై చేయి చేసుకోగా ఈ సంఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో కాస్తా ప్రస్తుతం ఇంటర్నెట్లో పెద్ద ఎత్తున చక్కర్లు కోడుతుంది.
Telangana Home Minister Mahamood Ali raises his hand on security for not bringing a bouquet to greet Minister Talasani Srinivas Yadav on his birthday pic.twitter.com/PDUFNcdUnP
తెలంగాణ రాజకీయాల్లో ఉన్నతాధికారులు బహిరంగంగా దురుసుగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. గతంలో హిమాయత్‌నగర్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఐకానిక్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టి అప్పట్లో కెమెరాకు చిక్కారు. మంత్రి కేటీ రామారావు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తిని మంత్రి కాలర్‌తో పట్టుకున్నట్లు వీడియోలో కనిపించింది. ఈ సంఘటన అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యాప్తి చెందింది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు ఏమైనా చేయగలరు అనేదానికి ఉదాహరణ అని పలువురు పేర్కొన్నారు. అంతేకాదు ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ వారిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అయిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలు బీఆర్ఎస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు నెటిజన్లు కూడా ఇలాంటి నేతల(leaders) తీరుపై మండిపడుతున్నారు.